Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Rahul Gandhi Is Very Popular In Pakistan He Will Win If He Contests There Acharya Pramod Krishnam

Acharya pramod krishnam: రాహుల్ గాంధీకి పాకిస్తాన్‌లో ఫుల్ క్రేజ్, అక్కడ పోటీ చేస్తే గెలుస్తాడు..

Published Date :May 31, 2025 , 8:26 pm
By Venu Goapl Reddy
  • రాహుల్ గాంధీకి పాకిస్తాన్‌లో ఫుల్ క్రేజ్..
  • అక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తే భారీ తేడాతో విజయం..
  • ఆయన పాకిస్తాన్ మాటలే ఎక్కువగా నమ్ముతారు..
  • విమర్శలు గుప్పించిన ఆచార్య ప్రమోద్ కృష్ణం
Acharya pramod krishnam: రాహుల్ గాంధీకి పాకిస్తాన్‌లో ఫుల్ క్రేజ్, అక్కడ పోటీ చేస్తే గెలుస్తాడు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు (ఎల్‌ఓపీ) రాహుల్ గాంధీపై మాజీ కాంగ్రెస్ నేత, ఆధ్యాత్మిక గురువు ఆచార్య ప్రమోద్ కృష్ణం శనివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీకి పాకిస్తాన్ లో ఫుల్ క్రేజ్ ఉందని, ఆయన అక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తే భారీ తేడాతో గెలుస్తారని ఆయన అన్నారు. రాహుల్ గాంధీకి సంబంధించిన కొన్ని వీడియోలు పాకిస్తాన్ మీడియాలో, అక్కడి సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ప్రమోద్ కృష్ణం ఈ వ్యాఖ్యలు చేశారు.

“రాహుల్ గాంధీ పాకిస్తాన్ నుండి ఎన్నికల్లో పోటీ చేస్తే, భారీ మెజారిటీతో గెలుస్తారు. రాహుల్ గాంధీ భారత నాయకుల, సంస్థల ప్రకటనలను నమ్మరు. భారత సైన్యం పాకిస్తాన్ కు తగిన సమాధానం ఇచ్చిందని చెప్పితే, రాహుల్ గాంధీ రుజువు కోరుతారు. కానీ పాకిస్తాన్ కు చెందిన నాయకుడు ఏదైనా చెబితే, అతను వెంటనే దానిని నమ్ముతాడు. అందుకే పాకిస్తాన్ ప్రజలు ఆయనను చాలా ప్రేమిస్తారు. ఆయనకు కూడా పాకిస్తాన్ బాగా అభిమానం ఉన్నట్లు అనిపిస్తుంది.’’ అని ఆయన అన్నారు.

ఆపరేషన్ సిందూర్‌పై ఇటీవల రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రమోద్ కృష్ణం నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ఇటీవల పలు సందర్భాల్లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారతీయ విమానాలు ఎన్ని కూలిపోయాయి అని ప్రశ్నించారు. విదేశాంగ మంత్రి ఆపరేషన్ గురించి పాకిస్తాన్‌కి ముందే తెలియజేశారని అన్నారు. దీనిపై కృష్ణం మాట్లాడుతూ..‘‘ భారత సైన్యాన్ని, పార్లమెంట్‌ని, రాజ్యాంగాన్ని ప్రశ్నించడం రాహుల్ గాంధీ అలవాటుగా మార్చుకున్నారు’’ అని చెప్పారు.

Read Also: Miss World 2025: కాసేపట్లో మిస్ వరల్డ్ విజేత ప్రకటన.. ఎలా ఎంపిక చేస్తారంటే.!

‘‘ఒక పిల్లవాడు దారి తప్పినప్పుడు, సాధారణంగా బాగుపడుతాడనే ఆశ ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ అంత ప్రముఖ కుటుంబం నుండి వచ్చినప్పటికీ, పూర్తిగా చెడిపోయినట్లు కనిపిస్తాడు. అతను మెరుగుపడే అవకాశం నాకు కనిపించడం లేదు. అయినప్పటికీ, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడవద్దని నేను అతనికి సలహా ఇస్తున్నాను.’’ అని ఆయన అన్నారు. ‘‘ఇందిరా గాంధీ పాకిస్తాన్‌కు గుణపాఠం నేర్పిన చాలా ప్రజాదరణ పొందిన నాయకురాలు. కానీ ఈ దేశానికి నరేంద్ర మోడీ లాంటి ప్రధాన మంత్రి ఎప్పుడూ లేరు. నేడు, ఆయన వల్ల భారతదేశం ప్రపంచవ్యాప్తంగా గౌరవం, భయాన్ని కలిగి ఉంది’’ అని చెప్పారు.

కాంగ్రెస్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, శశిథరూర్ ఆర్టికల్ 370 రద్దుని, ప్రధాని మోడీని ప్రశంసించడంపై మాట్లాడుతూ, కాంగ్రెస్ లో తిరుగుబాటు ఎప్పుడో ప్రారంభమైందని, నిజాలు తెలిశాయని, నరేంద్రమోడీ ప్రధాని కాకుంటే రామాలయం ఉండేది కాదని, ట్రిపుల్ తలాక్ రద్దు అయ్యేది కాదని, పాకిస్తాన్‌కి బలమైన జవాబు ఇచ్చే వాళ్లం కాదని అన్నారు. జాతీయ ప్రయోజనాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి ప్రశంసలకు అర్హుడని పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Acharya Pramod Krishnam
  • congress
  • Operation Sindoor
  • Pakistan
  • rahul gandhi

తాజావార్తలు

  • SRH vs KKR: క్లాసెన్ హాఫ్ సెంచరీ.. కోల్‌కతా టార్గెట్‌ 227 పరుగులు..

  • PVN Madhav: ఇది చారిత్రాత్మకం.. జై అమరావతి.. జై జై అమరావతి..

  • Suzuki Burgman: సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ 125.. 125cc సెగ్మెంట్‌లో బెస్ట్ ఫ్యామిలీ స్కూటర్?

  • Good Friday: ఏసుక్రీస్తుకు శిలువ వేసిన రోజు.. గుడ్ ఫ్రైడే ఎందుకు ‘‘గుడ్’’..

  • Gold and Silver Prices Drop: బంగారం, వెండి ధరల పతనం వెనుక డొనాల్డ్‌ ట్రంప్‌..!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions