Rahul Gandhi Tour: మరో యాత్రకు సిద్ధమవుతున్న రాహుల్ గాంధీ.. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ప్రారంభం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi Tour: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర విజయవంతం కావడంతో.. అదే ఊపుతో మరో యాత్రను చేపట్టాలని రాహుల్‌తోపాటు.. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే జోడో యాత్ర 2.0 ను చేపట్టాలని కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్టు సమాచారం. మరో యాత్ర సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర 2.0కు సిద్ధమవుతున్నారు. మొదటి దఫా భారత్ జోడో యాత్ర విజయవంతం కావడం.. కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఉండడంతో రెండో దఫా ఎప్పుడుంటుందా? అనే చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో.. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో యాత్ర 2.0 మొదలుకానుందని కాంగ్రెస్ విశ్వసనీయ వర్గాల సమాచారం. భారత్ జోడో యాత్ర నేషనల్ కో-ఆర్డినేషన్ కమిటీ హెడ్ దిగ్విజయ్ సింగ్.. యాత్ర 2.0 కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. గత వారం నుంచి పలువురు పార్టీ కీలక నేతలతో యాత్ర గురించి ఆయన చర్చలు జరుపుతున్నారు. అయితే చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని.. యాత్ర-2 ప్రారంభ తేదీ, రూట్‌మ్యాప్ మీద ఇంకా చర్చలు జరపాల్సి ఉందని ఏఐసీసీ సభ్యుడు ఒకరు చెబుతున్నారు. ఈ అంశాలపై తుది నిర్ణయం మాత్రం హైకమాండ్‌దేనని అంటున్నారాయన.
Read also: Tamilnadu : ఘోరం..40 ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఢీ కొట్టిన లారీ..
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7, 2022లో కన్యాకుమారి(తమిళనాడు) నుంచి ప్రారంభమై.. జనవరి 30, 2023 శ్రీనగర్(జమ్ముకశ్మీర్)తో ముగిసిన విషయం తెలిసిందే. యాత్రను ప్రారంభించడానికి ముందు అహ్మదాబాద్(గుజరాత్)లోని మహాత్మాగాంధీ స్మారకం వద్ద రాహుల్ గాంధీ నివాళులు అర్పించాడు. దీంతో గాంధీ జన్మస్థలం అయిన పోర్‌బందర్(గుజరాత్) నుంచి రెండో విడత యాత్ర మొదలుపెట్టాలనే ఆలోచన చేస్తోంది కాంగ్రెస్. పోర్‌బందర్ నుంచి పలు రాష్ట్రాల గుండా అగర్తలా(త్రిపుర)తో యాత్ర ముగిసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని భావిస్తోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర దక్షిణం నుంచి ఉత్తరానికి సాగింది. దీంతో రెండో దఫా యాత్రను పశ్చిమం నుంచి తూర్పు వైపునకు చేయాల్సి ఉంటుంది. అయితే.. ఎంతలేదన్న యాత్రకు ఆరు నెలల టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి.. ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఓ సీనియర్ నేత అభిప్రాయపడుతున్నారు. అలాగే సార్వత్రి ఎన్నికలకూ పెద్దగా సమయం ఉండదు.. తక్కువ సమయం ఉండడంతో యాత్రను మొదటి యాత్రలా పూర్తి మార్గం గుండా కాకుండా.. ఎంపిక చేసిన ప్రాంతాల్లో చేసేలా ఏర్పాట్లు చేసుకునే ఆలోచనను భారత్ జోడో యాత్ర నేషనల్ కమిటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో యాత్ర ప్రారంభించడానికి ప్లాన్ చేశారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!