NTV Telugu Site icon

Rahul Gandhi: నేటి నుంచి రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం.. శివసేన, ఎన్సీపీలతో జోడి..!

Rahul Gandihi

Rahul Gandihi

Rahul Gandhi: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేశారు. త్వరలో మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల ప్రచారాన్ని ఇవాళ్టి ( గురువారం) నుంచి లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. ఈ ప్రచారంలో రాహుల్ తో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సైతం పాల్గొననున్నారు. ఇక, రాహుల్ గాంధీ మధ్యాహ్నం 1 గంటకు వాంగిలో మాజీ రాష్ట్ర మంత్రి, దివంగత పతంగరావు కదమ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత 1.45 గంటలకు కడేగావ్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు అని జాతీయ కాంగ్రెస్‌ ఎక్స్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది.

Read Also: CM Revanth Reddy: ఎన్నికల ముందు డిక్లరేషన్ లో చెప్పినట్టే AI కి మొదటి ప్రాధాన్యత..

ఇక, 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి శివసేన (యూబీటీ) ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వం వహిస్తుండగా.. శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ(ఎస్పీ), కాంగ్రెస్‌ కలిసి కూటమిగా ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ, బీజేపీ మహాయుతి కూటమిగా మరోసారి కలిసి బరిలోకి దిగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ 160 నుంచి 170 సీట్లలో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది మహరాష్ట్రలో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. 48 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ 23 స్థానాలు, శివసేన 18 స్థానాలు, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ 4 స్థానాలు, కాంగ్రెస్‌ 2, స్వాభిమాని పక్ష ఒకస్థానంలో విజయం సాధించాయి.