Site icon NTV Telugu

Rahul Gandhi: ప్రధాని మోడీకి అంత సీను లేదు, మీడియా అతిగా చూపించింది..

Rahul Gandhi Modi

Rahul Gandhi Modi

Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ భగీదారీ బాయి సమ్మేళన్‌లో మాట్లాడుతూ..ప్రధాని మోడీకి చేసేదంతా ‘‘షో’’నే అని, ఆయకు సరైన విషయం లేదని అన్నారు. ఆయన ఒక పెద్ద ప్రదర్శన, ఆయనకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారని కామెంట్స్ చేశారు.

ప్రధాని మోడీని రెండు మూడు సార్లు కలిసిన తర్వాత, ఆయనతో ఒకే గదిలో కూర్చున్న తర్వాత, ప్రధాని మోడీ ఎప్పుడూ ‘‘పెద్ద సమస్య’’ కాదని తాను భావించానని, ఆయనకు దమ్ము లేదని రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని మోడీ వేవ్ లేదని, మీడియా ఆయన అంచనాలను అతి చేసి చూపించిందని ఆరోపించారు.

Read Also: Drone Missile: డ్రోన్ నుంచి మిస్సైల్ ప్రయోగం.. సత్తా చాటిన భారత్..

భారతదేశంలో అధికార వ్యవస్థలో అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం తక్కువగా ఉందని కాంగ్రెస్ ఎంపీ అన్నారు. దళితులు, వెనకబడిన తరగతులు, గిరిజనులు, మైనారిటీలు దేశ జనాభాలో 90 శాతం ఉన్నారు, కానీ బడ్జెట్ రూపొందించిన తర్వాత హల్వా పంపినీ చేస్తున్నప్పుడు, ఈ 90 శాతం మందికి ప్రాతినిధ్యం వహించే వారు ఎవరూ లేరని అన్నారు.

2004లో యూపీఏ-1 అధికారంలోకి వచ్చిన తర్వాత, తాను ఓబీసీలను అప్పుడే కలిసి ఉండాల్సిందని విచారం వ్యక్తం చేశారు. మీ చరిత్ర గురించి, సమస్యల గురించి అప్పుడే నాకు తెలిసి ఉంటే కుల గణన నిర్వహించే వాడినని అన్నారు. తాము చేసిన తప్పును సరిదిద్దుకుంటామని అన్నారు.

Exit mobile version