Site icon NTV Telugu

Rahul Gandhi: ప్రధాని మోడీ అయోధ్య నుంచి పోటీ చేస్తే.. పొలిటికల్ కెరీర్ ముగిసేది..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీ టార్గెట్‌గా మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌తో ఈ రోజు ఆయన కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలతో సమావేశమయ్యారు. ప్రధాని లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్య నుంచి పోటీ చేయాలనుకున్నారని, అయితే బీజేపీ సర్వే చేసి పరిస్థితి బాగా లేదని చెప్పడంతో ఆయన పోటీ చేయలేదని శనివారం అన్నారు. అహ్మదాబాద్‌లో పార్టీ నేతల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘అయోధ్యలో మేము ఓడించాము, బీజేపీ కంచుకోటలో ఆ పార్టీని కాంగ్రెస్ ఓడిస్తుంది’’ అని అన్నారు. అయోద్య నుంచి ప్రధాని మోడీ పోటీ చేసుంటే ఆయన పొలిటికల్ కెరీర్ ముగిసేదని చెప్పారు.

Read Also: Punjab: ఖలిస్తాన్ వ్యతిరేకించే శివసేన లీడర్‌‌పై దాడి.. చెలరేగిన రాజకీయ దుమారం..

ప్రధాని మోడీకి దేవుడితో ప్రత్యక్ష సంబంధం ఉందని చెప్పారని, అలాంటప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్యలో బీజేపీ ఎందుకు ఓడిపోయిందని రాహుల్ ప్రశ్నించారు. రామ మందిర నిర్మాణం జరిగిన కొన్ని నెలల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్య ఉన్న ఫైజాబాద్ లోక్‌సభ స్థానంలో బీజేపీ ఓడిపోయింది. సమాజ్ వాదీ పార్టీకి చెందిన అవధేష్ ప్రసాద్ చేతిలో బీజేపీ నేతని ఓడించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, ఎయిర్‌పోర్టు, ఇతర అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు నష్టపరిహారం అందకపోవడంతోనే బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వచ్చాయని తేలింది.

Exit mobile version