Site icon NTV Telugu

Rahul Gandhi: భారీ సంఖ్యలో పాల్గొనండి.. బీహార్ యువతకు రాహుల్‌గాంధీ విజ్ఞప్తి

Rahul Gandhi

Rahul Gandhi

బీహార్‌లో తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. మొత్తం 243 నియోజకవర్గాలు ఉండగా.. మొదటి విడతగా 121 నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ జరుగుతోంది. మొత్తం 3.75 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

తొలి విడత పోలింగ్ ప్రారంభం అయిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ బీహార్ యువతకు కీలక విజ్ఞప్తి చేశారు. భారీ సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. బీహార్ ప్రజల అభీష్టానికి అనుగుణంగా మహాఘట్‌బంధన్ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Putin Nuclear Test: ఇక పుతిన్‌ వంతు.. అణ్వాయుధ పరీక్షలకు ఆదేశించిన రష్యా అధ్యక్షుడు!

ఇదిలా ఉంటే బీహార్ పోలింగ్‌కు ఒక రోజు ముందు బుధవారం రాహుల్‌గాంధీ ‘‘ఓట్ చోరీ’’ కీలక ప్రజెంటేషన్ ఇచ్చారు. హర్యానాలో పెద్ద ఎత్తున ఓట్ల దొంతనం జరిగిందంటూ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను స్క్రీన్‌పై వేసి చూపించారు.

బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. తొలి విడతలో 121 స్థానాల్లో గురువారం పోలింగ్ జరుగుతుండగా… వచ్చే మంగళవారం 122 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ప్రధానంగా ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య పోటీ నెలకొంది. ఇక ప్రతిపక్ష కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ఉండగా.. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిని మాత్రం ప్రకటించలేదు.

ఇది కూడా చదవండి: Peddi vs Ustaad Bhagat Singh: ‘బాబాయ్-అబ్బాయ్’ బ్యాక్ టు బ్యాక్.. మెగా అభిమానులకు పండగే!

Exit mobile version