Rahul Gandhi: బీజేపీ ఎంపీలలో ప్రతి ఆరుగురిలో ఒకరు ఓట్ చోరీతో గెలిచారు.. రాహుల్ గాంధీ విమర్శలు
- బీజేపీపై రాహుల్ గాంధీ మరోసారి ఫైర్
- ‘ఓట్ల దొంగతనం’ ఆరోపణలు
- లోక్‌సభలో 240 బీజేపీ ఎంపీలపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “ఓట్ల దొంగతనం” ఆరోపణలను పునరుద్ఘాటిస్తూ సోషల్ మీడియాలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓట్ల దొంగతనం వల్ల కొన్నిసార్లు సీట్లు మాత్రమే కాదు, మొత్తం ప్రభుత్వాలే కూలిపోతాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తన పోస్టులో గణాంకాలను ప్రస్తావిస్తూ, లోక్‌సభలోని 240 మంది బీజేపీ ఎంపీలలో సుమారు ఆరుగురిలో ఒకరు ఓట్ల దొంగతనం ద్వారా గెలిచారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీజేపీ సొంత పరిభాషలోనే వారిని “చొరబాటుదారులు” అని పిలవాలా? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.
ఓటర్ల జాబితాపై ఆరోపణలు
Also Read
రాహుల్ గాంధీ ఓటర్ల జాబితాలు, ఎన్నికల ప్రక్రియలపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. కొన్ని సంస్థలు అధికార పార్టీ ప్రభావంలో పనిచేస్తూ, ఎన్నికల వ్యవస్థను రిమోట్ కంట్రోల్ చేస్తున్నాయని రాహుల్ ఆరోపించారు. “వారి అసలు భయం సత్యం పట్లే. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే, ఈరోజు వారు 140 స్థానాలకు దగ్గరగా కూడా గెలవలేరు” అని రాహుల్ అన్నారు.
హర్యానా ప్రభుత్వంపై విమర్శలు
హర్యానా ప్రభుత్వాన్ని ప్రస్తావిస్తూ, అక్కడి మొత్తం ప్రభుత్వమే ఒక “చొరబాటుదారు”లా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. ఓట్ల దొంగతనం, ఎన్నికల అక్రమాల కారణంగానే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఎన్నికల సంఘంపై విమర్శలు
ఇటీవల పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం కూడా రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై విమర్శలు చేశారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత ఉండాలని, ఓటర్ల జాబితాలపై పూర్తి స్థాయి పరిశీలన జరగాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ నుంచి దీనిపై ఎలాంటి ప్రతిస్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
- Tags
- bjp
- BJP MPs
- rahul gandhi
- Vote Theft
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు