Raghuram Rajan: అమెరికా విధించిన భారీ టారిఫ్‌లు భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.. ఇది దేశానికి మేల్కొలుపుగా పరిగణించాల్సిన అవసరం ఉందని మాజీ ఆర్బీఐ గవర్నర్, ఆర్థికవేత్త డాక్టర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక వ్యవస్థలు నేటి ప్రపంచంలో ఆయుధాలుగా ఉపయోగించబడుతున్నాయన్నారు. ఇప్పుడు, భారత్ జాగ్రత్తగా ముందుకు కొనసాగాలని హెచ్చరించారు. ఆగస్టు 27వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన అమెరికా 50 శాతం టారిఫ్‌లతో ఇండియన్ ఎగుమతిదారులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. చైనా, యూరప్ దేశాలు కూడా రష్యా నుంచి విస్తృతంగా ఎనర్జీ ఉత్పత్తులు కొనుగోలు చేస్తూనే ఉన్నా.. వారిపై సుంకాలు ఎందుకు విధించడం లేదని రఘురామ్ రాజన్ ప్రశ్నించారు.
Read Also: JK Encounter: జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
రష్యా చమురు దిగుమతులపై పునరాలోచన అవసరం
రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్ల వల్ల ఎవరు లాభపడుతున్నారు, ఎవరు నష్టపోతున్నారు అనే విషయాన్ని మనం ప్రశ్నించుకోవాలి అని మాజీ ఆర్బీఐ గవర్నర్ రాజన్ పేర్కొన్నారు. రిఫైనరీలు ఎక్కువ లాభాలు పొందుతున్నాయి.. కానీ, ఎగుమతిదారులు మాత్రం టారిఫ్‌లతో తీవ్రంగా నష్టపోతున్నారు.. లాభం పెద్దగా లేకపోతే, ఈ కొనుగోళ్లు కొనసాగించాలా లేదా అనే విషయాన్ని మళ్లీ ఆలోచించాలి అని సూచించారు.
Read Also: Mizoram: రాష్ట్రంలో భిక్షాటన పూర్తిగా నిషేధం.. బిల్లును ఆమోదించిన అసెంబ్లీ
నవరో వ్యాఖ్యలకు కౌంటర్..
నేటి గ్లోబల్ ఆర్డర్‌లో ప్రతి దేశానికి వాణిజ్యం ఆయుధంగా మారింది అని రాఘురామ్ రాజన్ తెలిపారు. పెట్టుబడులు, ఫైనాన్స్ రంగాలు కూడా ఆయుధాలుగా మారాయి.. మనం ఎవరిపైనా ఆధారపడకుండా, అనేక దేశాలతో వాణిజ్య సంబంధాలు కొనసాగించాలని అన్నారు.. అమెరికా, చైనా, జపాన్ లేదా యూరప్ – ఎవరి తోనైనా కలిసి ముందుకు కొనసాగాలి.. ఒకే దేశంపై ఎక్కువగా ఆధారపడకూడదు అని హితవు పలికారు. ఇక, భారత్ రష్యా చమురు కొనుగోళ్లతో లాభాలు సంపాదిస్తూ భారత్ యుద్ధాన్ని పెంచుతోందని అమెరికా వైట్‌హౌస్ సలహాదారు పీటర్ నవర్రో చేసిన ఆరోపణలను రఘురామ్ రాజన్ తీవ్రంగా ఖండించారు. ఇదంతా అమెరికా అధ్యక్షుడి అనుమతితోనే జరుగుతోంది అన్నారు. భారత్‌ను ఉద్దేశపూర్వకంగా ఒంటరిని చేశారని ఆరోపించారు.
Read Also: PEDDI : ‘పెద్ది’.. రామ్ చరణ్ ఇంట్రో కోసం భారీ ప్లాన్
చిన్న ఎగుమతిదారులపై ప్రభావం
అయితే, ఈ టారిఫ్‌లు చిన్న ఎగుమతిదారులపై- ముఖ్యంగా రొయ్యల సాగుదారులు, టెక్స్టైల్ తయారీదారులపై పెద్ద షాక్ అని రాజన్ హెచ్చరించారు. లైవ్ హుడ్స్ నష్టపోతాయని, అదే సమయంలో అమెరికన్ వినియోగదారులు కూడా 50 శాతం పెరిగిన ధరలకు వస్తువులు కొనాల్సి వస్తుందన్నారు. అలాగే, ట్రంప్ ప్రభుత్వ టారిఫ్‌ల వెనుక మూడు ప్రధాన కారణాలను ఆయన సూచించారు. 1. వాణిజ్య లోటు అనేది ఇతర దేశాల దోపిడీ అని నమ్మకం.. 2. టారిఫ్‌లు విదేశీ ఉత్పత్తిదారులపై భారమై, అమెరికాకు చవకగా ఆదాయం వస్తుందని భావన.. 3. ఇటీవలి కాలంలో టారిఫ్‌లను విదేశాంగ విధానంలో కక్షసాధింపు కోసం ఉపయోగిస్తున్నారని రఘురామ్ రాజన్ చెప్పుకొచ్చారు.
Read Also: Kamareddy: వరదలో చిక్కుకున్న 9 మంది.. నిన్న ఉదయం 10 గంటల నుంచి చెరువు మధ్యలోనే..
భారత వైఖరి
అమెరికా ఒత్తిడికి లోనుకాకుండా, తమ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తామని భారత ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంగా తెలిపింది. అదే సమయంలో చైనా, యూరప్ దేశాలు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటూనే ఉన్నా, వారికి ఇలాంటి జరిమానాలు విధించకపోవడాన్ని భారత్ వివక్షతగా పేర్కొంది.
