USA: రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహాయకుడు విమర్శలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు పరోక్షంగా భారత్ నిధులు సమకూరుస్తోందని ట్రంప్‌కి అత్యంత సన్నిహితంగా ఉండే స్టీఫెన్ మిల్లర్ అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ట్రంప్ పరిపాలన ఒత్తిడి తీవ్రతరం చేస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి.