Site icon NTV Telugu

Raghav Chadha: రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు ఆప్ షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు

Ra

Ra

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభలో తన నాయకత్వంలో ఒక కీలకమైన మార్పు చేసింది. రాజ్యసభలో డిప్యూటీ లీడర్‌గా రాఘవ్ చద్దా‌కు ఆమ్ ఆద్మీ పార్టీ షాకిచ్చింది. ఆయన స్థానంలో అశోక్ మిట్టల్‌ను ఆప్ నియమించింది. రాఘవ్ చద్దాను ఉప నాయకుడి పదవి నుంచి తొలగించి.. ఆ బాధ్యతను పంజాబ్ రాజ్యసభ ఎంపీగా ఉన్న డాక్టర్ అశోక్ మిట్టల్‌కు అప్పగించింది. ఈ మార్పుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సచివాలయానికి అధికారిక లేఖను పంపింది. ఇకపై డాక్టర్ అశోక్ మిట్టల్ రాజ్యసభలో పార్టీ ఉప నాయకుడిగా కొనసాగుతారని పేర్కొంది.

అశోక్ మిట్టల్ ఎవరు?
డాక్టర్ అశోక్ మిట్టల్ పంజాబ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. దేశంలో అత్యంత గౌరవనీయమైన విద్యావేత్తల్లో ఒకరిగా ఉన్నారు. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) ఛాన్సలర్ కూడా పని చేస్తున్నారు. అయితే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ముగింపులో రాఘవ్ చద్దాను తొలగించి ఆశ్చర్యపరిచింది.

Exit mobile version