Raghav Chadha: రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు ఆప్ షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
- రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు ఆప్ షాక్
- కీలక పదవి నుంచి తొలగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభలో కీలకమైన మార్పు చేసింది. రాజ్యసభలో డిప్యూటీ లీడర్‌గా ఉన్న రాఘవ్ చద్దాకు ఆమ్ ఆద్మీ పార్టీ షాకిచ్చింది. ఆయన స్థానంలో అశోక్ మిట్టల్‌ను ఆప్ నియమించింది. రాఘవ్ చద్దాను ఉప నాయకుడి పదవి నుంచి తొలగించి.. ఆ బాధ్యతను పంజాబ్ రాజ్యసభ ఎంపీగా ఉన్న డాక్టర్ అశోక్ మిట్టల్‌కు అప్పగించింది. ఈ మార్పుకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సచివాలయానికి అధికారిక లేఖను పంపింది. ఇకపై డాక్టర్ అశోక్ మిట్టల్ రాజ్యసభలో పార్టీ ఉప నాయకుడిగా కొనసాగుతారని పేర్కొంది.
ఇకపై రాఘవ్ చద్దాకు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని కోరింది. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు కారణంగానే ఈ పరిణామం జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల న్యాయస్థానం లిక్కర్ కేసులో కేజ్రీవాల్, మనీష్ సిసోడియాను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ విషయంపై బహిరంగంగా ఒక్కమాట కూడా రాఘవ్ చద్దా మాట్లాడలేదు. సోషల్ మీడియాలోనూ స్పందించలేదు. ఈ కారణంతోనే ఆయనపై వేటు వేసినట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Also Read
- India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!

అశోక్ మిట్టల్ ఎవరు?
డాక్టర్ అశోక్ మిట్టల్ పంజాబ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. దేశంలో అత్యంత గౌరవనీయమైన విద్యావేత్తల్లో ఒకరిగా ఉన్నారు. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) ఛాన్సలర్ కూడా పని చేస్తున్నారు. అయితే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ముగింపులో రాఘవ్ చద్దాను తొలగించి ఆశ్చర్యపరిచింది.ర
ఇది కూడా చదవండి: Iran-Israel: ట్రంప్ వ్యాఖ్యలతో మళ్లీ టెన్షన్.. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులు
AAP Sources: Aam Aadmi Party has informed the Rajya Sabha Secretariat that MP Raghav Chadha should not be allotted time to speak in Parliament. Further, the Aam Aadmi Party has submitted a letter to Rajya Sabha Secretariat to appoint MP Ashok Mittal as Deputy Leader of the party… pic.twitter.com/DquyHSze5P
— Press Trust of India (@PTI_News) April 2, 2026
తాజావార్తలు
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
ట్రెండింగ్
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?