Ashok mittal-Kejriwal: నమ్మినవాడే షాకిచ్చాడు.. మొన్నటిదాకా అశోక్ మిట్టల్ ఇంట్లోనే ఉన్న కేజ్రీవాల్
- మండు వేసవిలో ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్
- ఏడుగురు రాజ్యసభ ఎంపీలు ఊహించని దెబ్బ
- బీజేపీలో విలీనం అవుతున్నట్లుగా ప్రకటన
- ఇటీవల అశోక్ మిట్టల్‌కు కీలక పదవి అప్పగించిన కేజ్రీవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమ్ ఆద్మీ పార్టీకి మండు వేసవిలో భారీ షాక్ తగిలింది. ఇప్పుడిప్పుడే లిక్కర్ స్కామ్ నుంచి తేరుకుంటున్న సమయంలో రాఘవ్ చద్దా రూపంలో భారీ సంక్షోభం ముంచుకొచ్చింది. శుక్రవారం సాయంత్రం ఊహించని రీతిలో రాఘవ్ చద్దా బీజేపీ పంచన చేరారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆధ్వర్యంలో కాషాయ గూటికి చేరారు. రాఘవ్ చద్దాతో పాటు మరో ఇద్దరు ఆప్ ఎంపీలు అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ కూడా చేరారు. వీరికి స్వయంగా నితిన్ నబిన్ స్వీట్లు తినిపించారు. మరో నలుగురు ఎంపీలు కూడా బీజేపీలో చేరుతున్నట్లు రాఘవ్ చద్దా సంకేతాలు ఇచ్చారు. రాజ్యసభలో మొత్తం ఆప్‌కు 10 మంది ఎంపీలు ఉండగా ఏడుగురు తిరుగుబావుటా ఎగరేయడంతో అన్హరత వేటు తప్పించుకునేందుకు 2/3 వంతు చీలికతో బీజేపీలో విలీనం అవుతున్నట్లుగా రాఘవ్ చద్దా ప్రకటించారు. ఇది ఆప్‌కు ఊహించని షాక్.
అశోక్ మిట్టల్..
అశోక్ మిట్టల్.. కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశాక ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాల్సి వస్తే తన బంగ్లాలో ఉండాలని అశోక్ మిట్టల్ ఆహ్వానించారు. దీంతో ఏడాది పాటు కేజ్రీవాల్.. అశోక్ మిట్టల్ నివాసంలోనే ఉన్నారు. కానీ ఈ స్థాయిలో వెన్నుపోటు పొడుస్తాడని కేజ్రీవాల్ ఊహించలేకపోయారు. ఒకప్పుడు కేజ్రీవాల్ పట్ల విధేయత చూపించిన వాళ్లే.. ఇప్పుడు ద్రోహులుగా మారిపోయారు.
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఏప్రిల్ 2న రాఘవ్ చద్దాకు ఆప్ షాకిచ్చింది. రాజ్యసభలో డిప్యూటీ లీడర్‌గా ఉన్న రాఘవ్ చద్దాను తప్పించి ఆయన స్థానంలో అశోక్ మిట్టల్‌ను నియమించింది. ఈ మేరకు రాజ్యసభ సచివాలయానికి అధికారిక లేఖను కూడా పంపింది. అంతగా అశోక్ మిట్టల్‌ను కేజ్రీవాల్ నమ్మారు. కానీ అతడే వెన్నుపోటు పొడుస్తాడని కేజ్రీవాల్ ఊహించలేకపోయారు.
రాఘవ్ చద్దా ఒక్కరే పార్టీ వీడుంటే అనర్హత వేటు పడేది. ఆ వేటు నుంచి తప్పించుకునేందుకు తనతో పాటు మరో ఆరుగురు ఎంపీలను తీసుకెళ్లిపోయారు. రాఘవ్ చద్దాతో పాటు స్వాతి మాలివాల్, హర్భజన్ సింగ్, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, రాజిందర్ గుప్తా, విక్రమ్ సాహ్నీ బీజేపీ గూటికి చేరుతున్నారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!