Site icon NTV Telugu

FIFA World Cup: జకీర్ నాయక్‌కి ఖతార్ ఆహ్వానం.. ఫిఫాను భారత్ బ్యాన్ చేయాలన్న బీజేపీ నేత

Jakir Naik

Jakir Naik

Qatar’s invite to fugitive Islamic preacher Zakir Naik slammed by BJP leader: వివాదాస్పద ఇస్లామిక్ మతబోధకుడు జకీర్ నాయక్ ను ఖతార్ ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. ఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్ జరుగుతున్న క్రమంలో అక్కడ ఇస్లాంపై ఉపన్యాసాలు ఇవ్వడానికి ఖతార్ ప్రభుత్వం జకీర్ నాయక్ ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. భారతదేశంలో ఇస్లామిక్ ఉగ్రవాదానికి కారణం అవుతున్నాడని అతనిపై నేరాలు ఉన్నాయి. అప్పటి నుంచి మలేషియాలోొ ప్రవాసంలో ఉంటున్నాడు జకీర్ నాయక్. అయితే ఆయన్ను ఖతార్ ఆహ్వానించడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్‌ను ఖతార్ ఫిఫా ప్రపంచకప్‌కు ఆహ్వానించిన నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి సావియో రోడ్రిగ్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత ఫుట్ బాల్ అసోసియేషన్లు, అక్కడికి వెళ్లే భారతీయులు ఖతార్ ఫిఫా ఈవెంట్‌ను బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచం తీవ్రవాదంతో పోరాడుతున్న తరుణంలో జకీర్ నాయక్ ను ఖతార్ ఆహ్వానించడం అంటే ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ఉగ్రవాద సానుభూతిపరుడిని పిలిచినట్లే అవుతుందని రోడ్రిగ్స్ అన్నారు.

Read Also: Indonesia Earthquake: ఇండోనేషియా భూకంపంలో 252కు చేరిన మృతులు.. అండగా ఉంటామన్న ప్రధాని మోదీ

ఫిఫా వరల్డ్ కప్ అనేది గ్లోబల్ ఈవెంట్ అని.. ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు ఈ ఫుట్ బాల్ మ్యాచులను చూసేందుకు వస్తారని.. మిలియన్ల మంది టీవీల ద్వారా వీక్షిస్తారని.. ఇలాంటి సమయంలో ఓ ఉగ్రవాద సానుభూతిపరుడిని పిలవడం అంటే.. ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి వేదిక ఇచ్చినట్లే అని అన్నారు. భారతదేశంలో ఇస్లామిక్ రాడికల్ భావజాలం, ద్వేషం వ్యాప్తి చేయడంలో జకీర్ నాయక్ కీలక పాత్ర పోషించారని, ఆయన ఉగ్రవాది కన్నా తక్కువేం కాదని రోడ్రిగ్స్ అన్నారు.

మనీలాండరింగ్, విద్వేషపూరిత ప్రసంగాలు చేడయంపై భారత్ లో ఆయనపై అభియోగాలు ఉన్నాయి. భారతదేశానికి అతను మోస్ట్ వాంటెడ్. ఈ ఏడాది మార్చిలో హోం మంత్రిత్వ శాఖ జకీర్ నాయక్ స్థాపించిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ ని చట్టవిరుద్ధ సంస్థగా ప్రకటించి ఐదేళ్లు నిషేధం విధించింది. యువతను బలవంతంగా ఇస్లాంలోకి మార్చడం, ఉగ్రవాదులను కీర్తించడం, హిందూ దేవీదేవతపై అనుచిత వ్యాఖ్యలు చేయస్తుండటం వంటి అభియోగాలను జకీర్ నాయక్ ఎదుర్కొంటున్నారు. భారత్, విదేశాల్లో ఉంటున్న ముస్లిం యువత ఉగ్రవాదానికి ఆకర్షితం అయ్యేలా ప్రోత్సహిస్తున్నాడని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ లో పేర్కొంది.

Exit mobile version