Arvind Kejriwal: ఢిల్లీ మహిళల్ని మోసం చేయొద్దు.. కేజ్రీవాల్ ఇంటి ముందు పంజాబ్ మహిళల ఆందోళన..

  • ఢిల్లీ మహిళల్ని మోసం చేయొద్దు..
  • కేజ్రీవాల్ ఇంటి ముందు పంజాబ్ మహిళల నిరసన..
  • కాంగ్రెస్, బీజేపీ వారంటూ ఆప్ విమర్శలు..
Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ఒక్కసారిగా అక్కడి రాజకీయ వాతావరణం మారిపోయింది. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ, మరోసారి అధికారం చేపట్టాలని ఆప్, సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తున్నాయి. ముఖ్యంగా ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతోంది. ఇదిలా ఉంటే, ఈ రోజు పంజాబ్‌కి చెందిన మహిళలు అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆప్ ప్రభుత్వం హామీలను నెరవేర్చలేదని చెబుతూ మహిళలు ఆందోళనకు దిగడం ఉద్రిక్తంగా మారింది.

Read Also: Record in Bookings: 2024లో ఈ కారు కొత్త రికార్డు సృష్టించింది.. గంటలో 1.7లక్షల బుకింగ్స్!

×
×
Ad

పంజాబ్‌లో ప్రతీ మహిళకు రూ.1000 అందచేస్తామని హామీ ఇచ్చిన ఆప్ ప్రభుత్వం, దానిని నెరవేర్చలేదని నిరసనకారులు ఆరోపించారు. నాలుగోసారి వరసగా మళ్లీ గెలిస్తే తాము మహిళకు రూ. 2100 ఇస్తామని ఆప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ నిరసనలు జరగడం గమనార్హం. తమ సమస్యల్ని లేవనెత్తడానికి అమృత్‌సర్ నుంచి వచ్చినట్లు మహిళలు చెప్పారు. మాలాగే ఢిల్లీ మహిళల్ని మోసం చేయొద్దని నిరసనకారులు అన్నారు. అయితే, ఈ నిరసనపై ఆప్ ఎదురుదాడికి దిగింది. కేజ్రీవాల్ మాట్లాడుతూ.. నిరసన తెలుపుతున్న వారు కాంగ్రెస్, బీజేపీకి చెందిన వారని అన్నారు. ఈ రెండు పార్టీలు కూడా అనధికారికంగా పొత్తు ప్రకటించాయని దుయ్యబట్టారు.