Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్‌లో పుల్వామా సూత్రధారి హతం..

Hamza Burhan

Hamza Burhan

Pulwama Attack: పాకిస్తాన్‌లో గుర్తుతెలియని వ్యక్తులు సంచలనం క్రియేట్ చేశారు. పుల్వామా సూత్రధారి, పాకిస్తాన్‌కు చెందిన మోస్ట్ వాంటెంట్ ఉగ్రవాది హమ్జాను అజ్ఞాత వ్యక్తులు కాల్చి చంపారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో బుర్హాన్ హమ్జా మృతదేహం లభ్యమైంది.హమ్జా పుల్వామా దాడి సూత్రధారుల్లో ఒకడిగా ఉన్నాడు. ఇటీవల కాలంలో పాకిస్తాన్‌లోని భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని గుర్తుతెలియని వ్యక్తులు హతమారుస్తు్న్నారు. ఉగ్రవాది హమ్జాను కూడా ఇలాగే చంపారు.

డాక్టర్‌గా పిలిచే హమ్జా బుర్హాన్‌‌ను గుర్తుతెలియని వ్యక్తులు అనేక సార్లు కాల్చి చంపారు. పుల్వామా నివాసి అయిన బుర్హాన్ (ఇతడి అసలు పేరు అర్జుమండ్ గుల్జార్ దార్). 2022లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. పాకిస్తాన్ ఐఎస్ఐ ఇతడికి ప్రత్యేకంగా ఒక ఆఫీస్ సెటప్ చేసింది. నిత్యం ఐఎస్ఐ రక్షణ కల్పిస్తూ ఉంది. ఇతడి భద్రత కోసం ఏకే-47 కలిగిన బాడీగార్డులు రాత్రింబవళ్లు కాపలా కాస్తారు.

×
×
Ad

2019 ఫిబ్రవరి 14 జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో ఈ ఉగ్రవాద దాడి జరిగింది. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను బాంబులతో నిండిన కారుతో ఉగ్రవాదులు ఢీకొట్టారు. ఈ ఘటనలో 40 మంది జవాన్లు మరణించారు. పాకిస్తాన్ ప్రేరేపిత జైషే మహ్మద్ ఉగ్రసంస్థ ఈ దాడికి పాల్పడింది. ఆత్మాహుతికి పాల్పడిన వ్యక్తిని కాశ్మీర్‌కు చెందిన ఆదిల్ అహ్మద్ దార్‌గా గుర్తించారు. ఈ దాడికి ప్రతిగా ఫిబ్రవరి 26 2019లో భారత వైమానిక దళం బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలపై వైమానిక దాడులు చేసింది.