Pulwama attack architect Asim Munir to be Pakistan’s new army chief: పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ నియమిలయ్యారు. ప్రస్తుతం సైన్యాధ్యక్షుడిగా ఉన్న కమర్ జావేద్ బజ్వా నుంచి ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే భారత్ అంటే నరనరాన వ్యతిరేకత ఉన్న వ్యక్తి ఆసిమ్ మునీర్. ఇప్పటి వరకు పాకిస్తాన్ కు నియమితులైన ఏ సైన్యాధ్యక్షుడు కూడా భారతదేశంతో సత్సంబంధాలను కోరుకోలేదు. దీనికి అనుగుణంగానే మునీర్ కూడా వ్యవహరిస్తాడని భారత రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.
2019లో జమ్మూ కాశ్మీర్ లో జరిగిన పుల్వామా దాడులకు కుట్ర పన్నిన వ్యక్తి అసిమ్ మునీర్. ఆయన పర్యవేక్షణలోనే ఈ దాడులు జరిగాయి. ఆ సమయంలో మునీర్, పాకిస్తాన్ గూఢాచార సంస్థ ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ గా ఉన్నాడు. ఈ సమయంలోనే ఆ దాడి జరిగింది. కాశ్మీర్ లోని ప్రతీ ప్రాంతం గురించి అతనికి పట్టు ఉందని జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడు తిలక్ దేవాషెర్ అన్నారు. పుల్వామా దాడి తర్వాతే భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ దాడుల తర్వాత భారత్ సర్జికల్ స్ట్రైక్స్ తో పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసి, ఉగ్రవాదులను హతమార్చారు. పుల్వామా దాడికి జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కారణం అయినప్పటికీ..దీని వెనక ఐఎస్ఐ, పాక్ సైన్యం ఉంది. ముఖ్యంగా ఈ ప్లాన్ ఆర్టిటెక్ట్ గా అసిమ్ మునీర్ ఉన్నాడు.
Read Also: North Korea: కిమ్ కూతురు అంటే మామూలుగా ఉండదు.. యువరాణి తరహా సౌకర్యాలు
ఇదిలా ఉంటే అసిమ్ మునీర్ కూడా భారత వ్యతిరేకతను ప్రదర్శిస్తాడని భారత రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. పాకిస్తాన్ తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు అతను కీలకంగా వ్యవహరించే అవకాశం ఉందని.. పుల్వామా దాడి దృష్ట్యా భారత్, పరిణామాలను జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. భారత్-పాకిస్తాన్ సంబంధాలపై కొత్త ఆర్మీ చీఫ్ ప్రభావం చూపిస్తారని.. అలాగే పాకిస్తాన్ చిరకాల మిత్రుడు చైనా, అమెరికా సంబంధాలను కూడా ప్రభావితం చేస్తాడని భారత్ భావిస్తోంది.
భారత్ తో ఉద్రిక్తతలు పెంచేందుకు పాకిస్తాన్ ఎప్పుడూ..ఉగ్రవాదులను ఆశ్రయిస్తుంది. అయితే గతంలో మాదిరి కాకుండా భారత్ ఇప్పుడు దృఢ వైఖరితో ఉంది. ఒక వేళ పాకిస్తాన్ ఆర్మీ కానీ, ఉగ్రవాదులు కానీ ఏదైనా చర్య చేపడితే.. మరో సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ తప్పవని పాకిస్తాన్ కు తెలుసు. దీనికి తోడు భారత్ సందు దొరికితే పీఓకే, గిల్గిత్-బాల్టిస్థాన్ స్వాధీనం చేసుకునే ఆలోచనలో ఉంది. అందుకు తగ్గట్లుగానే భారత రక్షణ మంత్రి, భారత సైన్యం పలుమార్లు ప్రకటించింది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ ఉన్న పరిస్థితుల్లో ఇండియాపై పెద్దగా ఎలాంటి చర్యలు తీసుకోదని తెలుస్తోంది.