NTV Telugu Site icon

NIA: భారత ఎంబసీలపై దాడి చేసిన 43 మందిని గుర్తించిన ఎన్ఐఏ..

Khalistan

Khalistan

NIA: విదేశాల్లో భారత ఎంబసీలపై దాడికి పాల్పడిన 43 మంది అనుమానితులను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ గుర్తించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఖలిస్తాన్ మద్దతుదారులు అమెరికా, బ్రిటన్, కెనడాల్లోని భారత రాయబార కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. అనుమానితులందరిని ఎన్ఐఏ క్రౌడ్ సోర్సింగ్ విధానాన్ని ఉపయోగించి గుర్తించింది.

హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ ఏడాది జూన్ లో అమెరికా, కెనడా, యూకేల్లో భారత దౌత్యకార్యాలయాపై దాడులకు సంబంధించిన కేసును ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. భారతదేశంలో ఇప్పటి వరకు 50 వరకు ఎన్ఐఏ రైడ్స్ చేసింది. ఈ దాడుల్లో సుమారుగా 80 మంది వ్యక్తులను విచారించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి, జూలై నెలల్లో దౌత్యకార్యాలయాలు లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు. మార్చి 19న లండన్‌లోని ఎంబసీపై ఖలిస్తానీ వర్గాలు రెండుసార్లు దాడులు చేశాయి. జూలై 2న అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలో ఇలాంటి దాడులే జరిగాయి.

Read Also: Jammu Kashmir: ఉగ్రవాదంపై సమాచారం ఇస్తే భారీ నజరానా.. రూ.1 లక్ష నుంచి రూ.12.50 లక్షల రివార్డ్..

ఈ రెండు దాడులపై నేరపూరిత అతిక్రమణ, అనాగరికత, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించడం, రాయబార కార్యాలయ సిబ్బందికి హాని కలిగించడం, హింసను ప్రేరేపించడం వంటి ఆరోపణలతో ఎన్ఐఏ విచారణ జరుపుతోంది. ఈ హింసాత్మక ఘటనల్లో మరింత సమాచారం సేకరించడానికి ఆగస్టులో ఎన్ఐఏ అధికారులు అమెరికా వెళ్లారు. మరోవైపు మార్చి 2023 కెనడా, శాన్‌ఫ్రాన్సిస్కో దాడులకు సంబంధించి ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఉపా చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కెనడాలో భారత హైకమిషన్ వద్ద నిరసన సందర్భంగా ఏకంగా గ్రెనేడ్ విసిరారు. ఈ ఏడాది జూన్ నెలలో లండన్‌లో జరిగిన దాడిలో నిందితులను గుర్తించేందుకు ఎన్ఐఏ ప్రజల సాయాన్ని కోరింది.