Khalistan: ప్రభుత్వ పాఠశాల గోడపై “ఖలిస్తానీ” అనుకూల రాతలు.. దర్యాప్తు ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khalistan: ఖలిస్తానీ అనుకూలవాదులు విదేశాల్లోనే కాదు, దేశంలో కూడా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో హిందువుల దేవాలయాలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాల గోడలపై ఖలిస్తానీ అనుకూల రాతలు రాశారు. ఈ ఘటన శుక్రవారం ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. దీనిపై ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం దర్యాప్తు చేపట్టింది. ప్రత్యేక ఖలిస్తాన్ దేశానికి మద్దతుగా ఉన్న ఈ గ్రాఫిటీలను ఆ తర్వాత తొలగించారు.
Read Also: PM Modi: తన బాల్యాన్ని గుర్తుచేసుకుని ప్రధాని మోదీ కన్నీటి పర్యంతం..
Also Read
- NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో రెండో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. సీబీఐ అరెస్ట్ చేసిన మనీషా గురునాథ్ మంధారే ఎవరు?
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
- CNG Price Hike: రెండు రోజుల్లో రెండోసారి.. మళ్లీ పెరిగిన సీఎన్జీ ధరలు..
- Rajdhani Express Fire: రాజధాని ఎక్స్‌ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్‌లలో చెలరేగిన మంటలు
జనవరి 17న, ఔటర్ ఢిల్లీలోని చందర్ విహార్ ప్రాంతంలో గోడలపై ఇలాంటి నినాదాలు రాసి కనిపించాయి. ప్రత్యేక ఖలిస్తాన్ డిమాండ్‌పై ప్రజాభిప్రాయ సేకరణ కోరుతూ నినాదాలు చేశారు. నిషేధిత సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ గణతంత్ర దినోత్సవానికి ముందు బెదిరింపులకు పాల్పడిన కొన్ని రోజల తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రిపబ్లిక్ డే ముందు పన్నూ తన స్లీపర్ సెల్స్ ద్వారా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
పన్నూ అమెరికా-కెనడా ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్న అమెరికన్ సిటిజన్. ఇతడిని భారత్ ఉగ్రవాదిగా గుర్తించింది. గణతంత్ర దినోత్సవ వేడకుల రోజు పంజాబ్ సీఎం భగవంత్ మాన్, రాష్ట్ర డీజీపీ గౌరవ్ యాదవ్‌లను చంపుతా అని మంగళవారం బెదిరింపు సందేశాలు జారీ చేశాడు. జనవరి 22న అయోధ్యలో జరగబోయే రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంపై కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు.
తాజావార్తలు
-
Adarsha Kutumbam: వెంకీ – త్రివిక్రమ్ సినిమాలో వెంకటేశ్ పాత సాంగ్ రీమిక్స్..?
-
Rajnikanth : రజనీ అనేవాడు అలంటి వాడు కాదు.. ఆ పనులు ఎప్పడు చేయను
-
Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
-
IPL 2026 Black Tickets: జోరుగా బ్లాక్ టికెట్ దందా.. కీలక అధికారి ప్రమేయం.. ఒక్కో టికెట్ రూ.80 వేలు!
-
Peddi: ‘పెద్ది’ శాటిలైట్ డీల్ లాక్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..