Khalistan: ఖలిస్తానీ అనుకూలవాదులు విదేశాల్లోనే కాదు, దేశంలో కూడా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో హిందువుల దేవాలయాలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాల గోడలపై ఖలిస్తానీ అనుకూల రాతలు రాశారు. ఈ ఘటన శుక్రవారం ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. దీనిపై ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం దర్యాప్తు చేపట్టింది. ప్రత్యేక ఖలిస్తాన్ దేశానికి మద్దతుగా ఉన్న ఈ గ్రాఫిటీలను ఆ తర్వాత తొలగించారు.
Read Also: PM Modi: తన బాల్యాన్ని గుర్తుచేసుకుని ప్రధాని మోదీ కన్నీటి పర్యంతం..
జనవరి 17న, ఔటర్ ఢిల్లీలోని చందర్ విహార్ ప్రాంతంలో గోడలపై ఇలాంటి నినాదాలు రాసి కనిపించాయి. ప్రత్యేక ఖలిస్తాన్ డిమాండ్‌పై ప్రజాభిప్రాయ సేకరణ కోరుతూ నినాదాలు చేశారు. నిషేధిత సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ గణతంత్ర దినోత్సవానికి ముందు బెదిరింపులకు పాల్పడిన కొన్ని రోజల తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. రిపబ్లిక్ డే ముందు పన్నూ తన స్లీపర్ సెల్స్ ద్వారా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
పన్నూ అమెరికా-కెనడా ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్న అమెరికన్ సిటిజన్. ఇతడిని భారత్ ఉగ్రవాదిగా గుర్తించింది. గణతంత్ర దినోత్సవ వేడకుల రోజు పంజాబ్ సీఎం భగవంత్ మాన్, రాష్ట్ర డీజీపీ గౌరవ్ యాదవ్‌లను చంపుతా అని మంగళవారం బెదిరింపు సందేశాలు జారీ చేశాడు. జనవరి 22న అయోధ్యలో జరగబోయే రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంపై కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు.