Khakistan Protests: కెనడాలో ఖలిస్తానీల ఆందోళనలు.. ధీటుగా స్పందించిన భారతీయులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khakistan Protests: కెనడాలో భారత దేశానికి వ్యతిరేకంగా ఖలిస్తానీ మద్దతుదారులు భారత దౌత్యకార్యాలయాల ముందు భారీగా ఆందోళనలు చేపట్టారు. టొరంటోలోని దౌత్యకార్యాలయం ముందు పెద్ద ఎత్తున గుమిగూడారు. జూలై 8న భారీ ఎత్తున ఆందోళనకు ఖలిస్తానీవాదులు పిలుపునిచ్చారు. పోస్టర్లతో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీంతో నిన్న వందలాది మంది భారత కాన్సులేట్ ముందు ఖలిస్తాన్ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. ఇదిలా ఉంటే అక్కడ ఉండే భారతీయులు కూడా అదే స్థాయిలో స్పందించారు. భారతదేశానికి మద్దతుగా నినాదాలు చేశారు. ఇరు వర్గాలు పోటాపోటీగా జెండాలను పట్టుకుని ప్రదర్శనకు దిగారు. తొలుత ఖలిస్తానీలు ఆందోళనలు చేపట్టగా.. ఆ తరువాత భారత్ మద్దతు ప్రదర్శనలు జరిగాయి.
Read Also: Right Age For Pregnancy: తల్లి కావడానికి సరైన వయసు ఇదే.. దాటితే సమస్యలు తప్పవు
Also Read
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
కెనడా, యూఎస్ఏ, యూకేల్లో భారత వ్యతిరేక ఆందోళనలకు ఖలిస్తానీలు పిలుపునిచ్చారు. దీంతో ఆయా దేశాల్లో భారత దౌత్యకార్యాలయాల ముందు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలోని భారత కార్యాలయానికి భద్రత పెంచారు. భారత దౌత్యవేత్త తరణ్‌జీత్ సింగ్ ఎంబీసీ వద్ద పరిస్థితి సమీక్షించారు. జూలై 2న శాన్ ఫ్రాన్సిస్కో దౌత్యకార్యాలయానికి ఖలిస్తానీలు నిప్పటించారు. ఈ ఘటనను అమెరికా ఖండించింది.
ఇటీవల అనుమానాస్పదంగా ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు మరణించారు. కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే ఉగ్రవాదిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. అంతకుముందు పాకిస్తాన్ లోని లాహోర్. యూకేల్లో ఇలాగే ఇద్దరు ఖలిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే వీటికి భారతే కారణం అంటూ ఖలిస్తానీ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత దౌత్యవేత్తలను బెదిరించే విధంగా కెనడా వ్యాప్తంగా పోస్టర్లు వేశారు. కిల్లర్ ఇండియా అంటూ విద్వేషపూరిత రాతలతో భారత వ్యతిరేకతను ప్రదర్శించారు. వీటిపై కెనడా దేశానికి ఇప్పటికే భారత్ తన నిరసన తెలిపింది. ఈ చర్యలు ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీస్తాయని భారత్ తీవ్రంగానే స్పందించింది.
#WATCH | Pro-Khalistan supporters protested in front of the Indian consulate in Canada's Toronto on July 8
Members of the Indian community with national flags countered the Khalistani protesters outside the Indian consulate in Toronto pic.twitter.com/IF5LUisVME
— ANI (@ANI) July 9, 2023
తాజావార్తలు
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?