Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Priyanka Gandhis Son Raihan Vadra Aviva Baig Engagement Photos Viral

Priyanka Gandhi: ప్రియాంకాగాంధీ కుమారుడి నిశ్చితార్థం ఫొటోలు వైరల్

Published Date :January 3, 2026 , 7:55 am
By Suresh Maddala
  • ప్రియాంకాగాంధీ కుమారుడి నిశ్చితార్థం ఫొటోలు వైరల్
  • చిన్ననాటి ఫొటో షేర్ చేసిన రైహాన్ వాద్రా-అవివా బేగ్
  • సన్నిహిత కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం
Priyanka Gandhi: ప్రియాంకాగాంధీ కుమారుడి నిశ్చితార్థం ఫొటోలు వైరల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ కుమారుడు రైహాన్ వాద్రా-స్నేహితురాలు అవివా బేగ్‌కు సంబంధించిన నిశ్చితార్థం ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రాజస్థాన్‌లోని రణథంబోర్‌లోని ఒక ప్రైవేటు కార్యక్రమంలో ఇద్దరి నిశ్చితార్థం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను రైహాన్ వాద్రా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

ఇది కూడా చదవండి: Nepal: నేపాల్‌లో తప్పిన విమాన ప్రమాదం.. రన్‌వే‌ను దాటుకుని..!

Also Read

  • PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
  • Rs 397 Crore Transformer Scam: ​ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలులో రూ.397 కోట్ల స్కామ్.. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశాలు..
  • JMI VC Mazhar Asif: "భారతీయులందరిది మహాదేవుడి డిఎన్‌ఏ!".. ముస్లిం వైస్ ఛాన్సలర్ ఆసిఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
  • PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు

ఈ నిశ్చితార్థానికి అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలను కొత్త జంట సోషల్ మీడియాలో పంచుకున్నాయి. ఇద్దరూ చిన్నప్పుడు కలిసి ఉన్న ఒక ఫొటోను కూడా పోస్ట్ చేశారు. జంట చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. రైహాన్ తెల్లటి కుర్తా-పైజామా ధరించగా.. అవివా బేగ్ పసుపు రంగు సూట్ ధరించి కనిపించారు. ఇక నిశ్చితార్థ వేడుకలో కూడా సాంప్రదాయ భారతీయ దుస్తులనే ధరించారు. రైహాన్ ముదురు రంగు షేర్వానీ ధరించగా.. అవివా బేగ్‌ ప్రత్యేకమైన చీరలో కనిపించారు.

Kj

ఒక ఫొటోలో కొత్త జంటతో అవివా తల్లి నందితా బేగ్, తండ్రి ఇమ్రాన్ బేగ్, సోదరుడు రియాన్ బేగ్‌లు ఉన్నారు. ఇంకొక ఫొటోలో రాబర్ట్ వాద్రా-ఇమ్రాన్ బేగ్ కనిపించారు. రైహాన్ వాద్రా-అవివా బేగ్ ఏడేళ్ల నుంచి స్నేహం నడుస్తోంది. ఇటీవల కాలంలో రైహాన్ వాద్రా పెళ్లి ప్రపోజ్ చేయగా.. వెంటనే అవివా బేగ్ అంగీకరించింది. త్వరలోనే వివాహం కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవివా బేగ్‌ ఢిల్లీలోనే నివాసం ఉంటుంది. తండ్రి ఇమ్రాన్ బేగ్ వ్యాపారవేత్త. తల్లి నందితా బేగ్ ఇంటీరియల్ డిజైనర్. నిందిత-ప్రియాంకాగాంధీ మధ్య చాలా ఏళ్ల నుంచి మంచి స్నేహం ఉంది. ఆ కారణంతోనే కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్ ఇంటీరియర్ డిజైన్‌లో నిందిత పనిచేశారు.

అవివా ఢిల్లీలోని మోడరన్ స్కూల్‌లో చదువుకుంది. అనంతరం OP జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో మీడియా కమ్యూనికేషన్, జర్నలిజంలో ఉన్నత విద్యను పూర్తి చేసింది. అవివా కూడా ఇంటీరియర్ డిజైనర్, ఫోటోగ్రాఫర్, నిర్మాత కూడా. ఇక రైహాన్ వాద్రా.. డెహ్రాడూన్‌లోని ది డూన్ స్కూల్‌లో చదువుకున్నారు. తాత రాజీవ్ గాంధీ, మామ రాహుల్ గాంధీ కూడా అదే స్కూల్‌లో చదివారు. అనంతరం లండన్‌లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (SOAS)లో ఉన్నత విద్యను అభ్యసించారు. వృత్తిరీత్యా రైహాన్ దృశ్య కళాకారుడు.

 

View this post on Instagram

 

A post shared by Raihan (@raihanrvadra)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aviva baig engagement
  • photos viral
  • Priyanka gandhis son
  • raihan vadra

తాజావార్తలు

  • PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్

  • Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..

  • మోహన్‌లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్‌మెంట్!

  • Salman Khan-RR: సారీ భాయ్‌, ఈ రోజు కాదు.. సల్మాన్‌ ఖాన్ పోస్ట్‌కు రాజస్థాన్‌ రాయల్స్ రిప్లై!

  • Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions