Site icon NTV Telugu

Priyanka Gandhi: ఎంపీగా ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..!

Priyankagandhi

Priyankagandhi

కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ వయనాడ్ లోక్‌సభ బైపోల్‌లో ఘన విజయం సాధించారు. దాదాపు 4 లక్షలకు పైగా ఓట్లతో గెలుపొందారు. సోదరుడు రాహుల్ గాంధీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. తొలి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని అందుకున్నారు. ఇక నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో రవీంద్ర వసంతరావు చవాన్‌ గెలిచారు. కేవలం 1,457 ఓట్ల తేడాతో గెలిచారు. గురువారం ప్రియాంక. వసంతరావు పార్లమెంట్‌లో ఎంపీలుగా ప్రమాణం చేయనున్నారు. దీంతో తొలిసారి ప్రియాంక పార్లమెంట్‌లో అడుగుపెట్టబోతున్నారు.

ఇది కూడా చదవండి: Prevent Heart Attack: వేకువజాము గుండెపోటుకు బాపట్ల ప్రొఫెసర్ చెక్‌.. పేటెంట్‌ ఇచ్చిన కేంద్రం..

2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి భారీ విజయంతో గెలుపొందారు. అయితే రాహుల్.. రాయ్‌బరేలీ స్థానాన్ని ఉంచుకుని.. వయనాడ్ స్థానాన్ని వదిలేశారు. దీంతో అక్కడ బైపోల్ అనివార్యమైంది. ఇక ఆ స్థానం నుంచి ప్రియాంక రంగంలోకి ఘన విజయాన్ని అందుకున్నారు. ఇక వయనాడ్‌లో బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌ మూడో స్థానంలో నిలిచారు.

ప్రియాంక గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం మాత్రమే నిర్వహించే వారు. పార్టీ గెలుపు కోసం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలిసారి వయనాడ్ బైపోల్‌లో దిగి విజయం సాధించారు. ఇక గురువారం పార్లమెంట్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. పార్లమెంట్ మెంబర్‌గా ప్రియాంక ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఇది కూడా చదవండి: Kollywood : తమిళ ఇండస్ట్రీని ఆదుకున్న చిన్న హీరోలు

Exit mobile version