NTV Telugu Site icon

Priyanka Gandhi: నేడు ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణస్వీకారం

Priyanka

Priyanka

Priyanka Gandhi: కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. దాదాపు 4 లక్షలకు పైగా ఓట్లతో గెలిచారు. సోదరుడు రాహుల్ గాంధీ కంటే ఎక్కువ ఓట్లను సాధించింది. తొలి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని ఆమె అందుకున్నారు. ఇక, నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర వసంతరావు చవాన్‌ గెలుపొందారు. కేవలం 1,457 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈరోజు (నవంబర్ 28) లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా సమీక్షంలో ప్రియాంక గాంధీ, వసంతరావు ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో తొలిసారి ప్రియాంక పార్లమెంట్‌లో అడుగు పెట్టబోతున్నారు.

Read Also: Off The Record: ఆ మాజీ ఎమ్మెల్యే యూటర్న్..? టైం కోసం ఎదురుచూస్తున్నారా..?

ఇక, 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే రాహుల్.. రాయ్‌బరేలీ స్థానాన్ని ఉంచుకుని.. వయనాడ్ స్థానానికి రాజీనామా చేశాడు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక, ఆ స్థానం నుంచి రంగంలోకి దిగిన ప్రియాంక గాంధీ ఘన విజయాన్ని దక్కించుకున్నారు. అలాగే, వయనాడ్‌లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నవ్య హరిదాస్‌ మూడో స్థానంలో ఉండిపోయారు. అయితే, ప్రియాంక గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం మాత్రమే చేసింది. పార్టీ గెలుపు కోసం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించింది. కానీ, తొలిసారి వయనాడ్ బైపోల్‌లో బరిలోకి దిగి విజయం సాధించారు. ఇక ఈరోజు పార్లమెంట్‌లోకి అడుగు పెట్టబోతున్నారు. పార్లమెంట్ మెంబర్‌గా ప్రియాంక ప్రమాణస్వీకారం చేయనున్నారు.