Priyanka Gandhi Son: ప్రియురాలితో ప్రియాంకాగాంధీ కుమారుడు నిశ్చితార్థం! కోడలు ఎవరంటే..!
- ప్రియాంకాగాంధీ ఇంట పెళ్లి బాజా
- స్నేహితురాలితో రైహాన్ వాద్రా నిశ్చితార్థం
- 7 ఏళ్ల నుంచి అవివా బేగ్‌తో రైహాన్ వాద్రా స్నేహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ కుమారుడు రైహాన్ వాద్రా(25).. తన చిరకాల స్నేహితురాలు అవివా బేగ్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీకి చెందిన అవివా బేగ్‌తో ఏడేళ్ల నుంచి రైహాన్ వాద్రా మధ్య స్నేహం కొనసాగుతోంది. ఇటీవల అవివా బేగ్‌కు పెళ్లి ప్రపోజ్ చేయగా ఆమె ఓకే చెప్పింది. దీంతో ఇద్దరూ నిశ్చితార్థం చేసుకున్నట్లు నివేదికలు అందుతున్నాయి.
ఇరు కుటుంబాలు పెళ్లికి ఓకే చెప్పడంతోనే ఇద్దరికీ నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. అవివా బేగ్, ఆమె కుటుంబం ఢిల్లీలో స్థిరపడింది. ఇరు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉన్నట్లుగా వర్గాలు పేర్కొన్నాయి.
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్‌కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
రైహాన్ వాద్రా…
రైహాన్ వాద్రా దృశ్య కళాకారుడు (Visual Artist), వైల్డ్‌లైఫ్, స్ట్రీట్, కమర్షియల్ ఫొటోగ్రఫీతో గుర్తింపు తెచ్చుకున్నాడు. పదేళ్ల వయసులోనే కెమెరా చేతపట్టాడు. తాత, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ కూడా ఫోటోగ్రఫీని ఇష్టపడేవారు. దానిపైనే ఎక్కువ మక్కువ చూపించడంతో తల్లి ప్రియాంకాగాంధీ ఎంతగానో ప్రోత్సహించింది. 2021లో ఢిల్లీలోని బికరేన్ హౌస్‌లో ‘డార్క్ పర్సెప్షన్’ పేరుతో తొలి ఎగ్జిబిషన్ నిర్వహించాడు. అవీవా బేగ్ కూడా ఫొటోగ్రాఫర్, ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇద్దరికీ ఒకే రుచి ఉండడంతో మనసులు కలిశాయి. ఇక 2017లో పాఠశాల క్రికెట్ మ్యాచ్ సందర్భంగా రైహాన్ వాద్రా కంటికి గాయమైంది.

తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!