NTV Telugu Site icon

BJP: కాంగ్రెస్ “ఆధునిక ముస్లిం లీగ్”.. ఓటు బ్యాంక్ ఉన్న చోటే గాంధీ ఫ్యామిలీ పోటీ..

Pradeep Bhandari

Pradeep Bhandari

BJP: ప్రియాంకా గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయడంపై బీజేపీ సంచలన విమర్శలు చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ కాంగ్రెస్ పార్టీపై విరుచుపడ్డారు. ప్రియాంగా గాంధీ వయనాడ్ పారిపోయి, సురక్షితంగా ఉన్న సీట్లలో మాత్రమే పోరాడుతున్నారని ఆయన ఆరోపించారు. ముస్లిం ఓట్లు 30 శాతం లేదా అంతకన్నా ఎక్కువ ఉన్న నియోజకవర్గాలను గాంధీ కుటుంబం ఎంచుకుంటుందని, గాంధీ కుటుంబం అక్కడే సురక్షితంగా ఉంటుందని ఆయన అన్నారు.

Read Also: US-China trade war: అమెరికా-చైనా శత్రుత్వాన్ని భారత్ సద్వినియోగం చేసుకోలేదా?

ప్రియాంకా గాంధీ వయనాడ్ పారిపోయారు. ఆమె సోదరుడు రాహుల్ గాంధీ అక్కడ నుంచి పోటీ చేశారని, 90 శాతం ముస్లిం ఓట్లు వచ్చాయని, ప్రస్తుతం ప్రియాంకా గాంధీ ఈ ఓట్లతో గెలవాలని ప్రయత్నిస్తుందని అన్నారు. కాంగ్రెస్ ‘‘ఆధునిక ముస్లిం లీగ్’ అని పిలిచిన భండారీ, హిందూ సమాజాన్ని విభజించాలని కాంగ్రెస్ కోరుకుంటోందని అన్నారు. వారు హిందూ సమాజాన్ని విభజించాలని అనుకుంటున్నారని, ముస్లిం సమాజంలోని కులాల గురించి మాట్లాడరని విమర్శించారు. దేశవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారని అన్నారు.

ఉత్తర్ ప్రదేశ్‌లో పార్టీ 90 శాతం ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిందని గుర్తు చేశారు. నేను పోరాడగలిగే మహిళ అని ప్రియాంకా గాంధీ చెప్పుకున్నారని, కానీ వారు 90 శాతం డిపాజిట్లు కోల్పోయారని, ఎందుకంటే వారి ఓటు బ్యాంకు రక్షించలేదని చెప్పారు. ప్రియాంకాగాంధీ బుధవారం వయనాడ్ ఎంపీ స్థానానికి నామినేషన్ వేశారు.