Navya Haridas: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆమె నిర్వహించిన రోడ్ షోతో పాటు బహిరంగ సభపై బీజేపీ అభ్యర్థి నవ్యా హరిదాస్ తీవ్ర విమర్శలు గుప్పించారు. టూరిస్ట్ ప్రదేశానికి తీసుకువెళ్తామని ప్రియాంక సభకు ప్రజలను తరలించారంటూ ఆరోపించారు. ఆమె ఓ ప్రముఖ రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది.. నేను కార్పొరేషన్ కౌన్సిలర్‌గా ప్రజల కోసం ఏళ్ల తరబడి పని చేసిన అనుభవం ఉంది అని నవ్వా చెప్పుకొచ్చింది. ఒక అభ్యర్థి గొప్పతనం వారి కుటుంబ ఆధిపత్యమే ప్రమాణమైతే అది ప్రియాంకకు మాత్రమే చెందుతుందన్నారు. భారతీయ జనతా పార్టీకి అలాంటి ప్రమాణాలు లేవు.. ఆమె రావడం, రోడ్ షోలు చేయడం వంటివి సంవత్సరానికి వచ్చిపోయే పండగల సీజన్ లాంటివి అన్నారు. ఇక, ఈరోజు (గురువారం) బీజేపీ అభ్యర్థి నవ్యా హరిదాస్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
Read Also: Aishwarya : పెళ్లయినా తగ్గేదేలే అంటున్న అర్జున్ కూతురు
కాగా, ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్‌ల నుంచి పోటీ చేసి రాహుల్ గాంధీ విజయం సాధించారు. అయితే, వయనాడ్ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికలో బీజేపీ నుంచి నవ్యా హరిదాస్, కాంగ్రెస్ నుంచి ప్రియాంకా గాంధీ ఎన్నికల బరిలో ఉండగా.. ఎల్‌డీఎఫ్ తరపు సీపీఐ నేత, మాజీ శాసనసభ్యులు సత్యన్ మొరీ పోటీలో ఉన్నారు నవంబర్ 13వ తేదీన బైపోల్స్ జరగనుండగా.. 23న తుది ఫలితాలు వెల్లడికానున్నాయి.