Site icon NTV Telugu

Priyanka Gandhi: ఓట్ల చోరీపై గాంధీలాంటి పోరాటం చేస్తున్నాం.. బీహార్ ర్యాలీలో ప్రియాంకాగాంధీ వ్యాఖ్య

Priyankagandhi

Priyankagandhi

ప్రజల హక్కుల కోసం మహాత్మాగాంధీలాంటి పోరాటం చేస్తున్నామని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ అన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కతిహార్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు.

ఇది కూడా చదవండి: Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ వచ్చేసింది.. ఎప్పటినుంచంటే..!

‘‘ప్రస్తుతం మహాత్మాగాంధీ పోరాడిన హక్కులు ప్రమాదంలో ఉన్నాయి. అత్యంత ముఖ్యమైన హక్కుల్లో ఓటు హక్కు ఒకటి. ప్రస్తుతం దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతోంది. ఓట్ల దొంగతనం కోసం పౌరుల హక్కులను కాలరాస్తున్నారు. రాజ్యాంగాన్ని బలహీనపరిచేలా బీజేపీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ, మహాఘట్‌బంధన్ పోరాడుతున్న పోరాటం.. అప్పట్లో మహాత్మాగాంధీ పోరాడిన యుద్ధం లాంటిదే. నేటికీ మీ హక్కుల కోసం, సత్యం కోసం, ఒక సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం.. అది నరేంద్ర మోడీ సామ్రాజ్యం. ప్రజలను అణచివేస్తూ దేశాన్ని నడుపుతున్నారు.’’ అని ప్రియాంకాగాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇది కూడా చదవండి: PM Modi: యువతకు బీజేపీ ల్యాప్‌టాప్‌లు ఇస్తుంటే.. ఆర్జేడీ రివాల్వర్లు ఇస్తోంది.. విపక్షంపై మోడీ విమర్శలు

ప్రధాని మోడీ గూండా భాష మాట్లాడుతున్నారని.. అలాంటి భాష ప్రధానికి తగదన్నారు. అంతేకాకుండా మతం పేరుతో అడుగుతున్నారని ధ్వజమెత్తారు. ‘‘రూ.10,000 ఇస్తున్నారు కదా? అని ఎవరూ మోసపోవద్దు. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇచ్చారా?, ఎన్నికల ముందే ఇస్తారు?, రూ.10 వేలు లంచం ఇచ్చి ఓట్లు పొందాలనుకుంటున్నారు. పురుషులు ఎప్పటికీ మహిళల బాధలను అర్థం చేసుకోలేరు. మోడీ ప్రభుత్వం అన్ని పరిశ్రమలను ఇద్దరు స్నేహితులకు అప్పగించింది. కాంట్రాక్ట్ పనుల్లోనూ వారి ఆధిపత్యమే నడుస్తోంది. దేశం యొక్క ఆస్తులన్నీ నాశనం అయ్యాయి. నితీష్ కుమార్ చేతుల్లో ఎలాంటి అధికారం లేదు. అంతా ఢిల్లీ నుంచే కంట్రోల్ చేస్తున్నారు.’’ అని ప్రియాంకాగాంధీ వ్యాఖ్యానించారు.

బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. తొలి విడత పోలింగ్ నవంబర్ 6న ముగిసింది. 121 స్థానాల్లో 65.08 శాతం పోలింగ్ నమోదైంది. 1951 తర్వాత అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. ఇక రెండో విడత పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. మంగళవారం 122 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ప్రధానంగా ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య పోటీ నెలకొంది.

 

Exit mobile version