గత వారం నుంచి దేశ వ్యాప్తంగా ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలిసిందే. తాజాగా ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోడీ స్పందించారు. డీజీసీఏ నిబంధనలు వ్యవస్థను మెరుగుపరచడానికే గానీ.. ప్రజలను వేధించడానికి కాదని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
మంగళవారం ఉదయం ఎన్డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండిగో సంక్షోభంపై స్పందించారు. నియమాలు, నిబంధనలు వ్యవస్థను మెరుగుపరిచేలా చూసుకోవాలని.. అంతేకాని భారతీయ పౌరులను ఇబ్బందులకు గురి చేసుకోకుండా చూసుకోవాలని ప్రధాని మోడీ చెప్పినట్లుగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు వెల్లడించారు. ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోడీ ఇండిగో సంక్షోభం కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఆవేదన వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
