CPI Narayana: ఫీజులు కట్టలేదని కొన్ని విద్యా సంస్థలు విద్యార్ధుల సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాను.. అనేక ఆడంబరాలకు ఖర్చు పెడుతున్నారు.. విద్యార్ధులకు చెల్లించాల్సినవి మీకు ఎక్కువయ్యాయా అని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు సీఎంలు కూడా స్టూడెంట్స్ విషయంలో అసలు నిర్లక్ష్యం వహించకూడదన్నారు. ఇక, కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రభుత్వం చేతిలోకి వచ్చింది.. ముగ్గురు సభ్యుల కమిటీ వేసింది తెలంగాణ ప్రభుత్వం.. వీరి నివేదికను పూర్తిగా స్టడీ చేసి.. సలహాలు ఇస్తారు.. అబద్ధాలను చాలా అందంగా చెప్పగలిగే నైపుణ్యం దేశంలో ఇద్దరికీ చాలా బాగా తెలుసు… అది ఒకటి మోడీ, రెండు కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టునీ అతను ఇష్టానుసారంగా నిర్మాణం చేయించాడు అని నారాయణ విమర్శించారు.
Read Also: PM Modi: అన్నదాతలకు శుభవార్త.. పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన మోడీ
ఇక, కర్ణాటకలోని పవిత్ర దేవాలయంగా భావించే ధర్మశాలలో అసలు ఏం జరుగుతుంది? అని సీపీఐ నారాయణ ప్రశ్నించారు. దాదాపుగా 400 మందిని అక్కడ చంపి పాతేశారు.. ఇప్పుడు ఎముకలు బయట పడుతున్నాయి.. యాడ్యూరప్ప ప్రభుత్వం ఉన్నప్పుడు పట్టించుకోలేదు.. కాంగ్రెస్ సర్కార్ ఉంది కాబట్టి కనీసం సిట్ వేసి విచారణ చేస్తున్నారు.. కర్ణాటక హైకోర్టు తీర్పునీ స్వాగతిస్తున్నామన్నారు. ఇక, బీజేపీ వాళ్ళు ఆత్మన్యూనతా భావనలోకి వెళ్ళిపోతున్నారు.. బ్లాక్ స్పాట్ విధానం అమలు చేస్తున్నారు.. ధర్మశాలనీ దేవాదాయ శా కి హ్యాండ్ ఓవర్ చేయాలని డిమాండ్ చేశారు. తక్షణం అక్కడ జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ట్రస్టీని అరెస్ట్ చెయ్యాలని కోరారు. తాజాగా, కాశ్మీర్ లో పర్యటించాను.. పహల్గాం వెళ్ళాలి అనుకున్నాము.. కానీ ఆర్మీ వాళ్లు ఆంక్షలు పెట్టడంతో వెళ్ళలేకపోయాం.. పహల్గాం దాడిలో ఉన్న టెర్రరిస్టులను ఒక్కరిని కూడా మోడీ ప్రభుత్వం చంపలేదు.. మొన్న పార్లమెంట్ ప్రారంభానికి ముందు రోజు ఒక ఉగ్రవాదిని చంపారు.. ఇన్నాళ్లుగా వాళ్లు దొరకలేదా అని కేంద్రాన్ని అడిగారు. వాళ్ళు నిజంగా టెర్రరిస్టులేనా కాదా అనేది మరొక అంశం అని నారాయణ చెప్పుకొచ్చారు.
Read Also: Anasuya : చెప్పు తెగుద్ది.. అంటూ బోల్డ్ కామెంట్లపై అనసూయ స్ట్రాంగ్ రియాక్షన్
అయితే, అమెరికా అధ్యక్షుడు టెర్రరిజాన్ని వ్యతిరేకించారు.. కానీ పాకిస్తాన్ ను తప్పుబట్టలేదు అని నారాయణ పేర్కొన్నారు. ట్రంప్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా.. భారత ప్రధాని ఒక్కమాట మాట్లాడడం లేదు.. ట్రంప్ నేనే ఆపాను యుద్ధాన్ని అంటాడు.. మన ప్రధాని నోరు తెరవడు.. ఎందుకంత భయం.. బానిస లాగా ఎందుకు భావించడం అని అడిగారు. మోడీ తన విధానాలను మార్చుకోవడం లేదు.. దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికే త్రిపురలో ప్రారంబించారు.. ఏపీలో కూడా అమలుకు సిద్ధమయ్యారు.. త్రిపురలో రైతులతో మాట్లాడితే.. గతంలో నెలకు 150 రూపాయల బిల్లు వచ్చేదని.. ఇప్పుడు 80 వేలు వస్తుందని చెబుతున్నారు.. స్మార్ట్ మీటర్ కాదు అది విష్ణు చక్రం.. అంత స్పీడ్ గా తిరుగుతోంది.. బిల్లులు కూడా అలాగే వస్తున్నాయని ఆరోపించారు. త్వరలో మా పార్టీ జాతీయ మహాసభలు జరగబోతున్నాయి.. ఇండియా కూటమిలో కూడా లోపాలు ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు.
