అమెరికా అధ్యక్షుడు టెర్రరిజాన్ని వ్యతిరేకించారు.. కానీ పాకిస్తాన్ ను తప్పుబట్టలేదు అని నారాయణ పేర్కొన్నారు. ట్రంప్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా.. భారత ప్రధాని ఒక్కమాట మాట్లాడడం లేదు.. ట్రంప్ నేనే ఆపాను యుద్ధాన్ని అంటాడు.. మన ప్రధాని నోరు తెరవడు.. ఎందుకంత భయం.. బానిస లాగా ఎందుకు భావించడం అని అడిగారు.
విశాఖ సెవెన్ హిల్స్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది... పైన ఓయో రూమ్స్ కింద నర్సింగ్ హాస్టల్ పెట్టి భద్రత గాలికొదిలేసారు హాస్టల్ యాజమాన్యం.. అర్దరాత్రి బాయ్ ఫ్రెండ్ ను కలవడానికి గోడ దూకి బయటకి వెళ్లేందుకు ప్రయత్నించింది విద్యార్థిని..