Video: ‘‘మిమ్మల్ని చాలా మిస్సయ్యాం’’..మోడీకి ట్రంప్ ఆత్మీయ ఆలింగనం..
- ప్రధాని మోడీకి వైట్ హౌజ్‌లో ఘన స్వాగతం..
- మోడీకి ట్రంప్ ఆత్మీయ ఆలింగనం..
- ‘‘మిమ్మల్ని చాలా మిస్ అయ్యామన్న ట్రంప్’’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Video: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళ్లారు. వైట్ హౌజ్‌లో ప్రధాని మోడీకి ట్రంప్ ఘనంగా స్వాగతం పలికారు. వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్‌లోని వెస్ట్ వింగ్ లాబీలో ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతం పలికారు. ఇద్దరు నాయకులు ఒకరినొకరు పలకరించుకుంటూ, హృదయపూర్వకంగా కౌగిలించుకున్నారు. ‘‘మేము మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం’’ అని ట్రంప్ మోడీతో అన్నారు. ట్రంప్‌ని మళ్లీ చూడటంపై ప్రధాని మోడీ ఆనందం వ్యక్తం చేశారు.
Read Also: PM Modi: అక్రమ వలసదారులకు మోడీ షాక్.. వారికి ఆ హక్కు లేదని ప్రకటన..
Also Read
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎక్స్‌లో మోడీ, ట్రంప్ ఫోటోలను షేర్ చేశారు. ప్రధాని మోదీ వచ్చిన వెంటనే విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రాతో సహా భారత ప్రతినిధి బృందం వైట్‌హౌస్‌కి వెళ్లింది. ప్రధాని మోడీ రాకకు ముందు వైట్ హౌజ్ వద్ద భారత జెండాలను ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత, ఆయనను కలిసిన ప్రపంచ నాయకుల్లో నాలుగో వ్యక్తి మోడీ.
ట్రంప్, మోడీకి ‘‘ అవర్ జర్నీ టుగెదర్’’ అనే బుక్‌ని గిఫ్ట్‌గా ఇచ్చారు. ‘‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ యూ ఆర్ గ్రేట్’’ అని సంతకం చేసి, బుక్‌ని మోడీకి అందించారు. 2020లో భారత్ లో తాను పర్యటించినప్పటి ఫోటోలను అందులో పొందుపరిచారు. ‘‘హౌడీ మోడీ’’, ‘‘నమస్తే ట్రంప్’’ ఈవెంట్లలో ఇరువురు నేతలు ఉన్న ఫోటోలు బుక్‌లో ఉన్నాయి. ప్రధాని మోడీని వైట్ హౌజ్‌కి స్వాగతించడం నాకు చాలా ఆనందంగా ఉందని ట్రంప్ అన్నారు. ఐదేళ్ల క్రితం నేను సుందరమైన భారతదేశానికి వెళ్లాను, ప్రపంచంలోనే పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, భారత్ మధ్య ప్రత్యేక బంధం ఉందని ట్రంప్ అన్నారు.
#WATCH | Washington, DC | PM Narendra Modi and President Donald Trump share a hug as the US President welcomes the PM at the White House
President Trump says, "We missed you, we missed you a lot." pic.twitter.com/XTk1h7mINM
— ANI (@ANI) February 13, 2025
తాజావార్తలు
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్‌కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!