Prateek Yadav Death: నీలం రంగులో కాలి బొటన వేలు.. ప్రతీక్ యాదవ్ పోస్టుమార్టం రిపోర్ట్‌లో కీలక విషయాలు..
- ప్రతీక్ యాదవ్ పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు..
- శరీరంపై ఆరు చోట్ల గాయాలు..
- మరణానికి ‘‘పల్మనరీ థ్రోంబోఎంబోలిజం’’ కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prateek Yadav Death: ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ మరణం ఉత్తర్ ప్రదేశ్‌ను షాక్‌కు గురిచేసింది. 38 ఏళ్ల వయసులో ప్రతీక్ మరణించారు. ఆయన మరణానికి ప్రధాన కారణం ‘‘పల్మనరీ థ్రోంబోఎంబోలిజం’’ అని డాక్టర్లు చెప్పారు. ఉపరితిత్తుల్లోని ఒక సిరలో రక్తం గడ్డకట్టడం వల్ల గుండె, ఊపిరితిత్తులు అకాస్మత్తుగా పనిచేయడం ఆగిపోయి, శరీర వ్యవస్థలు అన్ని నిర్వీర్యం అయ్యాయి. దీంతోనే మరణం సంభవించినట్లు పోస్టుమార్టం నివేదిక చెబుతోంది.
లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ప్రతీక్ యాదవ్ శరీరంపై మొత్తం ఆరు గాయాలను గుర్తించారు. ఛాతీ భాగం, కుడి చేయి, మోచేతి, ఎడమ మణికట్టు ప్రాంతాల్లో ఈ గాయాలు ఉన్నట్లు రిపోర్టు చెప్పింది. వీటిలో కొన్ని 5-7 రోజలు పాతగా తేలింది. మరికొన్ని మరణానికి ఒక రోజు ముందు జరిగినట్లు వైద్యులు తెలిపారు.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
Read Also: CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
తమ దర్యాప్తును ధ్రువీకరించుకోవడానికి వైద్యులు కెమికల్, హిస్టోపాథలాజికల్ పరీక్షల కోసం అంతర్గత అవయవాలు, గుండెను భద్రపరిచారు. ఏదైనా విషం, ఇతర రసాయన ఆనవాళ్లు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవడానికి అంతర్గత అవయవాలను పరీక్ష కోసం పంపించనున్నారు. నివేదిక వస్తే మరణానికి మరింత ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని వైద్యులు చెబుతున్నారు.
పోస్టుమార్టం నివేదిక సమయంలో పాత గాయాలుగా భావిస్తున్న కమిలిన గుర్తుల్ని కనుగొన్నారు. మరణానికి కారణంగా గుండెపోటుగా నిర్ధారించబడింది. అనారోగ్యం కారణంగా ప్రతీక్ ఎడమ కాలి బొటన వేటు నీలి రంగులోకి మారింది. ప్రతీక్ యాదవ్ లివర్, ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ముందు నుంచే ఉన్నట్లు సమచారం. ఆయన పలుమార్లు ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రి తీసుకువచ్చే సమయానికే చనిపోయి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!