NTV Telugu Site icon

Prashant Kishor: కొత్త పార్టీ ప్రకటించిన ప్రశాంత్ కిశోర్.. పార్టీ పేరు ఇదే..!

Prashantkishor

Prashantkishor

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. ‘జన్ సురాజ్’ పార్టీ (Jan Suraj Party)ని బుధవారం వెల్లడించారు. ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ.. తమ పార్టీ రెండేళ్లుగా క్రియాశీలకంగా ఉందని, ఎన్నికల సంఘం నుంచి కూడా ఆమోదం పొందిందని వెల్లడించారు. బీహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Minister Seethakka: మాజీ మహిళా మంత్రుల చరిత్ర.. ఇప్పటి మహిళా మంత్రుల చరిత్ర ప్రజలకు తెలుసు

బీహార్‌లో 30 ఏళ్లుగా ఆర్జేడీ, జేడీయూ, బీజేపీలకే ఓట్లు వేస్తు్న్నారని. ఆ సంప్రదాయం అంతం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తమ పార్టీ రాజవంశానికి చెందినది కాదని తెలిపారు. జన్ సురాజ్ పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించినట్లు తెలిపారు. బీజేపీతో కలిసి పని చేసేందుకు పార్టీ ఏర్పాటు చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఇక మద్యపాన నిషేధాన్ని రద్దు చేస్తామని చెప్పారు. అన్ని స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తోందని స్పష్టం చేశారు. పార్టీకి ఇండియన్ ఫారిన్ సర్వీస్ రిటైర్డ్ అధికారి మనోజ్ భారతి నేతృత్వం వహిస్తారని వెల్లడించారు. అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని నిలిపివేస్తామని.. దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని విద్యా రంగాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తామని చెప్పారు.

ఇది కూడా చదవండి: Bengaluru: డోర్‌ దగ్గర నిలబడ వద్దన్నందుకు కండక్టర్‌పై కత్తితో దాడి.. వీడియో వైరల్