Site icon NTV Telugu

Prashant Kishor: బీహార్ ఎన్నికల వేళ అసదుద్దీన్‌కు ప్రశాంత్ కిషోర్ కీలక సలహా

Prashant Kishor

Prashant Kishor

బీహార్ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. అన్ని పార్టీలు నువ్వానేనా? అన్నట్టుగా దూకుడుగా వెళ్తున్నాయి. ఇక బీహార్ ఎన్నికల వేళ జాన్ సూరాజ్ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీకి కీలక సలహా ఇచ్చారు. అసదుద్దీన్ స్నేహితుడే కానీ.. హైదరాబాద్‌లో ఆయన కోటను కాపాడుకుంటే మంచిది అని సూచించారు. అనవసరంగా సీమాంచల్‌కు వచ్చి అనవసరమైన గందరగోళం సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోనే ఉండి… అక్కడి ముస్లింల సంక్షేమం చూసుకుంటే మంచిది అని హితవు పలికారు.

ఇది కూడా చదవండి: Delhi Acid Attack Case: ఢిల్లీ యాసిడ్ దాడి కేసులో బిగ్ ట్విస్ట్.. షాకైన పోలీసులు

‘‘సీమాంచల్ పుత్రులే సీమాంచల్ నాయకులుగా ఉండాలి.’’ అని ప్రశాంత్ కిషోర్ అన్నారు. బీహార్ ముస్లింలు 2020 నాటి తప్పు మళ్లీ చేయరని భావిస్తున్నట్లు తెలిపారు. ఒవైసీ సాహెబ్‌ అంటే మంచి గౌరవం ఉందని.. బాగా చదువుకున్నాడని కితాబు ఇచ్చారు. హైదరాబాద్‌లో ఉండి.. పార్టీని పటిష్టం చేసుకోవాలి కానీ.. బీహార్‌లో ఏం పని అని వ్యాఖ్యానించారు. ఇక్కడ నాయకులు.. ఇక్కడ ముస్లింల గురించి పట్టించుకుంటారని చెప్పారు.

‘‘సీమాంచల్’’ అనే పదం ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలోని ఒక ప్రాంతాన్ని సూచిస్తుంది. ఇది పూర్ణియా డివిజన్‌ను సూచిస్తుంది. అలాగే ‘‘సీమాంచల్ ఎక్స్‌ప్రెస్’’ అనే సూపర్ ఫాస్ట్ రైలు కూడా ఉంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఐదు సీట్లు గెలుచుకుంది. సీమాచల్‌లోని నాలుగు జిల్లాల్లోని 24 అసెంబ్లీ స్థానాల్లో గత ఐదు ఎన్నికల్లో పార్టీల మధ్య ఊగిసలాట చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Cyclone Montha: 10 జిల్లాలపై మొంథా తుఫాన్‌ తీవ్ర ప్రభావం.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు..

సీమాంచల్‌లో మొత్తం 24 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. పూర్నియా జిల్లాలో ఏడు, అరారియాలో ఆరు, కిషన్‌గంజ్‌లో నాలుగు, కతిహార్‌లో ఏడు ఉన్నాయి. గత ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడుసార్లు ఆధిక్యంలో ఉంది. 2020లో ఎనిమిది స్థానాల్లో.. 2010లో 13 స్థానాలతో, అక్టోబర్ 2005లో తొమ్మిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. కిషన్‌గంజ్‌లో 68 శాతం ముస్లింలు ఉండగా.. అరారియాలో 43 శాతం, కతిహార్‌లో 45 శాతం, పూర్నియాలో 39 శాతం ఉన్నారు. ఇక్కడ ఎంఐఎం పోటీ చేస్తుండడంతో ప్రశాంత్ కిషోర్ లాంటి పార్టీలకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఈ విజ్ఞప్తి చేశారు. మళ్లీ అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకోవాలని అసదుద్దీన్‌కు హితవు పలికారు.

 

Exit mobile version