Prashant Kishor: అందుకే కాంగ్రెస్‌లో చేరడంలేదు.. క్లారిటీ ఇచ్చిన పీకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారానికి తెరపడింది… కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి, పార్టీ అధినేత్రి నుంచి సానుకూలత వ్యక్తం అయినా.. చివరకు పార్టీలోకి రావాలంటూ పీకేను సోనియా గాంధీ ఆహ్వానించిన తర్వాత.. ఆ ఆఫర్‌ను తిరస్కరించారు పీకే.. తాను కాంగ్రెస్‌లో చేరడం లేదంటూ కుండబద్దలు కొట్టేశాడు.. దీంతో, గత కొంత కాలంగా హాట్ టాపిక్‌గా మారిన ప్రశాంత్ కిషోర్ ఎపిసోడ్‌కు ఎండ్ కార్డ్ పడినట్టు అయ్యింది. వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న పార్టీని.. ప్రశాంత్ కిషోర్ గాడిలో పెడతాడని గంపెడు ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఈ పరిణామంతో నిరాశే ఎదురైంది.
Read Also: Revanth Reddy: మంత్రి పువ్వాడకు రేవంత్‌రెడ్డి చాలెంజ్.. నువ్వే సీబీఐకి లేఖ రాయి..
Also Read
- CM Vijay: తిరుచ్చిలో విజయ్ భారీ సభ.. సీఎంగా కాదు.. సేవకుడిగా వచ్చా.. అదే టార్గెట్..!
- Bengaluru Traffic: కడుపుతో ఉన్న భార్య కోసం ఖాకీలతోని కొట్లాట.. నడిరోడ్డుపై కూర్చున్న సామాన్యుడు! వీడియో వైరల్..
- Kalita Majhi: బెంగాల్ రాజకీయాల్లో సామాన్య ఆడబిడ్డ సంచలనం .. రాష్ట్ర మంత్రిగా ఇళ్లల్లో పనులు చేసుకునే మహిళ !
- Abhishek Banerjee: రాళ్లు విసురుతున్నారు.. కోడిగుడ్లతో కొడుతున్నారు..మమత మేనల్లుడుపై ఎందుకింత కసి?
కాంగ్రెస్ పార్టీ ఆఫర్‌ను తిరస్కరించిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఆ విషయాన్ని వెల్లడించారు పీకే.. అసలు కారణాలు ఏంటి? అనేది కూడా క్లారిటీ ఇచ్చారు.. వ్యవస్థాగతంగా లోతైన సమస్యల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి తన కన్నా నాయకత్వం, సమష్టి సంకల్పం అవసరమని తన ట్వీట్లో పేర్కొన్న ఆయన.. తాను కాంగ్రెస్‌లో చేరడం, చేరకపోవడం అంత ముఖ్యం కాదు.. కాంగ్రెస్‌లో పూర్తిగా పునర్వ్యవస్థీకరణ జరగడం ముఖ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు రాకపోతే ప్రయోజనం లేదన్న పీకే.. సాధికారత కమిటీలో చేరాలని, ఎన్నికల బాధ్యత తీసుకోవాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనన తాను తిరస్కరించినట్టు వెల్లడించారు.. కాగా, కాంగ్రెస్‌లో చేరేందుకు నిరాకరించిన ప్రశాంత్ కిషోర్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు ఆ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే.
I declined the generous offer of #congress to join the party as part of the EAG & take responsibility for the elections.
In my humble opinion, more than me the party needs leadership and collective will to fix the deep rooted structural problems through transformational reforms.
— Prashant Kishor (@PrashantKishor) April 26, 2022
తాజావార్తలు
-
CM Vijay: తిరుచ్చిలో విజయ్ భారీ సభ.. సీఎంగా కాదు.. సేవకుడిగా వచ్చా.. అదే టార్గెట్..!
-
Chasemaster vs Hitman: కోహ్లీ, రోహిత్ కెరీర్లో ఇంతటి వ్యత్యాసమా.. రోహిత్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్ పడినట్లేనా..?
-
Peddi : ‘పెద్ది’ ఆకలి తీరుస్తుందా?
-
Ram Charan Body Gaurd : రామ్ చరణ్ బాడీ గార్డుకు బాడీ గార్డులు.. ఇది కదా క్రేజ్ అంటే!
-
Suriya48 లోడింగ్.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న క్రేజీ లైనప్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!