Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఆస్తులెంతో తెలుసా.. నోరెళ్ల బెట్టాల్సిందే..!
- బంకీపూర్ బైపోల్‌కు ప్రశాంత్ కిషోర్ నామినేషన్
- వెలుగులోకి వచ్చిన వ్యూహకర్త ఆస్తుల వివరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం బీహార్‌లోని బంకీపూర్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నారు. తొలిసారి ఎన్నికల కదనరంగంలోకి దిగారు. 2025లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రచారానికే పరిమితం అయ్యారు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇప్పుడు నేరుగా బైపోల్ ద్వారా పోటీ రంగంలోకి దిగారు. దీంతో బంకీపూర్ ఉప ఎన్నిక దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే సోమవారం బాంకీపూర్ ఉపఎన్నికకు ప్రశాంత్ కిషోర్ నామినేషన్ దాఖలు చేశారు. తాజాగా అఫిడవిట్ వెలుగులోకి వచ్చింది. ఇందులో ఆస్తుల వివరాలు వెల్లడించారు. ప్రశాంత్ కిషోర్ పేరిట మొత్తం రూ.96.06 కోట్ల ఆస్తులు ఉండగా… ఆయన భార్య డాక్టర్ జాహ్నవి దాస్ పేరిట రూ.101.93 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రశాంత్ కిషోర్ దగ్గర రూ.22.19 కోట్ల విలువైన చరాస్తులు ఉండగా.. ఆయన భార్య దగ్గర రూ.89.51 కోట్ల చరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. వ్యక్తిగత సంపదలో ప్రధాన భాగం వేదాస్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో ఆయనకు ఉన్న 100 శాతం వాటా.. ఈ వాటా విలువ రూ.95.26 కోట్లుగా పేర్కొన్నారు. అదనంగా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, మార్కెట్ పెట్టుబడుల రూపంలో రూ.7.36 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తెలిపారు.
Also Read
స్థిరాస్తుల విషయానికి వస్తే.. బిహార్‌లోని రోహ్తాస్ జిల్లాలో మూడు ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న పాత రైస్ మిల్, పాట్నాలోని పాట్లిపుత్ర కాలనీ, ఢిల్లీలోని వసంత్ విహార్, ఘాజియాబాద్‌లో నివాస గృహాలు, అలాగే పూర్వీకుల ఆస్తుల్లో వాటా ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆయన స్థిరాస్తుల మొత్తం విలువ రూ.73.87 కోట్లు కాగా.. భార్య స్థిరాస్తుల విలువ రూ.12.42 కోట్లుగా వెల్లడైంది.
ఎనిమిది క్రిమినల్ కేసులు
ఇక ప్రశాంత్ కిషోర్‌పై ప్రస్తుతం ఎనిమిది క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అఫిడవిట్లో వెల్లడైంది. వీటిలో ఎక్కువ కేసులు 2024, 2025 సంవత్సరాల్లో నమోదైనవే. అనధికారికంగా గుమికూడడం, అల్లర్లు, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కల్పించడం, క్రిమినల్ కుట్ర, పరువునష్టం వంటి ఆరోపణలు ఈ కేసుల్లో ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఏ కేసులోనూ ఆయనకు శిక్ష పడలేదని, అధికారికంగా అభియోగాలు కూడా ఖరారు కాలేదని పేర్కొన్నారు. ఈ కేసుల్లో కొన్ని పాట్నా హైకోర్టులో విచారణలో ఉండగా, మరికొన్ని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టుల పరిధిలో ప్రాథమిక దశలో ఉన్నాయి.
ఉన్నత విద్యాభ్యాసం
విద్యార్హతలు కూడా అఫిడవిట్లో ప్రస్తావించారు. 1991లో బీహార్ బోర్డు పరిధిలో బక్సర్‌లో పదో తరగతి పూర్తి చేశారు. అనంతరం పాట్నా సైన్స్ కాలేజీలో ఇంటర్ చదివి, లక్నో విశ్వవిద్యాలయం నుంచి బీబీఏ పట్టా పొందారు. తర్వాత హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI)లో మాస్టర్ ఆఫ్ హెల్త్‌కేర్ అడ్మినిస్ట్రేషన్ (MHA) పూర్తి చేశారు. ఈ కోర్సు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ-హిందూజా హాస్పిటల్ భాగస్వామ్యంతో నిర్వహించబడింది. అలాగే 2010లో ఫ్రాన్స్‌లోని కావిలామ్ విచీ (CAVILAM Vichy)లో ఫ్రెంచ్ భాషలో ప్రత్యేక శిక్షణ కూడా పూర్తి చేశారు.
నామినేషన్‌కు ముందు భారీ ర్యాలీ
ఇక నామినేషన్ దాఖలు చేసే ముందు ప్రశాంత్ కిషోర్ భారీ పాదయాత్ర నిర్వహించారు. స్కౌట్ అండ్ గైడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ కొత్వాలి పోలీస్ స్టేషన్, డాక్ బంగ్లా, ఎస్పీ వర్మా రోడ్, జేపీ రౌండబౌట్, గాంధీ మైదాన్ మీదుగా జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుంది. ఈ ర్యాలీలో జన్ సురాజ్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ‘‘లడేంగే బాంకీపూర్.. జీతేంగే బాంకీపూర్’’ అంటూ నినాదాలు చేశారు. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ కిషోర్.. ‘‘ఇది కేవలం నా నామినేషన్ కాదు. బీహార్ ముఖచిత్రాన్ని మార్చే ఉద్యమానికి, రాష్ట్ర భవిష్యత్తుకు నాంది. నేరస్తులను అధికారంలో నుంచి తొలగించే పోరాటానికి ఇది ప్రారంభం’’. అని వ్యాఖ్యానించారు.
బంకీపూర్ ఉప ఎన్నిక ఈనెల 30న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం ఆగస్టు 3న విడుదల కానున్నాయి. ఇక్కడ బీజేపీ, ఆర్జేడీ గట్టి పోటీ ఇస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్‌కు ప్రజలు ఎలా ఆదరిస్తారో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఆస్తులెంతో తెలుసా.. నోరెళ్ల బెట్టాల్సిందే..!
-
Shiv Charan Reddy: ‘నన్ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు’.. మనసులు నొప్పించి ఉంటే క్షమించండి: శివచరణ్ రెడ్డి
-
Jr NTR : NTRపై పెద్ద కుట్ర..ఆ సంస్థపై పోలీసులకు ఫిర్యాదు!
-
Jasprit Bumrah: రీఎంట్రీ మ్యాచ్‌లో రికార్డుల వర్షం.. చరిత్ర సృష్టించిన బుమ్రా..
-
Rana Daggubati: రిషబ్ శెట్టి vs రానా.. ‘జై హనుమాన్’లో అసలేం జరుగుతుంది?
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!