Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Prashant Kishor As Kingmaker In Bihar Elections 2025 Survey

Bihar Elections: తాజాగా మరో షాకింగ్ సర్వే.. అంచనాలు తల్లకిందులు కానున్నాయా?

Published Date :September 15, 2025 , 1:50 pm
By Suresh Maddala
  • బీహార్ ఎన్నికలపై వెలుగులోకి తాజా సర్వే
  • అంచనాలు తల్లకిందులు కానున్నాయా?
Bihar Elections: తాజాగా మరో షాకింగ్ సర్వే.. అంచనాలు తల్లకిందులు కానున్నాయా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

త్వరలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇంకోవైపు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌పై తీవ్ర కసరత్తు చేస్తోంది. వచ్చే నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానున్నట్లు తెలుస్తోంది. మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించేలా ఈసీ ప్లాన్ చేస్తోంది. ఇదంతా ఒకెత్తు అయితే తాజాగా రాష్ట్ర ఎన్నికలపై సంచలన సర్వే వెలుగులోకి వచ్చింది.

ఇది కూడా చదవండి: Earthquake: ఓ వైపు భూప్రకంపనలు.. ఇంకోవైపు వణికిన పిల్లల వార్డు.. అస్సాం నర్సులు ఏం చేశారంటే..!

సెప్టెంబర్ 14న (ఆదివారం) ఓట్ వైబ్ సర్వే తన ఫలితాలను ప్రకటించింది. అయితే ఈ ఫలితాల్లో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఈసారి జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్ కాబోతున్నారని స్పష్టం చేసింది. ఎక్స్-ఫ్యాక్టర్‌గా ప్రశాంత్ కిషోర్ మారొచ్చని తాజా ఒపీనియన్ పోల్ సర్వే అంచనా వేసింది. ఇక ప్రధాన కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొందని తెలిపింది. ఎన్డీఏ కూటమికి 36.2 శాతం ఓట్లు వస్తుండగా.. ఇండియా కూటమికి 35.8 శాతం మంది ఓట్లు రానున్నట్లు తెలిపింది. ఎన్నికల ఫలితం చివరి నిమిషంలో వచ్చే మార్పులను బట్టి ఉంటుందని సర్వే పేర్కొంది.

ఇది కూడా చదవండి: Acharya Devvrat: మహారాష్ట్ర గవర్నర్‌గా ఆచార్య దేవవ్రత్ ప్రమాణం

ఇక మహాఘట్‌బంధన్‌కు యువతే ప్రధాన ఓటు బ్యాంక్‌గా మారనుంది. ఇక కుల సమీకరణ లెక్కలు మాత్రం ఇరువైపులా కీలకంగా ఉన్నాయి. జూలైలో చేసిన సర్వేలో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా సెప్టెంబర్‌లో చేసిన సర్వేలో కూడా 48 శాతం నితీష్ కుమార్ ప్రభుత్వంపై వ్యతిరేక వ్యక్తమైంది. జూలైలో 18.3 శాతం ఉండగా.. ఇప్పుడు 27.1 శాతానికి పెరిగింది. యువ ఓటర్లు (18-24) ప్రభుత్వ వ్యతిరేకతను (57%) వ్యక్తం చేస్తున్నారు. ఇండియా కూటమికి ముస్లింల ఓటు బ్యాంక్ కీలకంగా మారింది. 70 శాతం ముస్లింలు మహాఘట్‌బంధన్‌కే మద్దతు ఇస్తున్నారు. 5 శాతం మంది మాత్రం ఎన్డీఏ కూటమికి వేస్తామని చెప్పారు.

అగ్రవర్ణాల్లో, షెడ్యూల్డ్ కులాల్లో కూడా ఎన్డీఏకి బలమైన మద్దతు ప్రకటించారు. షెడ్యూల్డ్ కులాల్లో 43 శాతం మంది ఎన్డీఏకి మద్దతు ఇవ్వగా.. 25 శాతం మంది ప్రతిపక్ష కూటమికి మద్దతిచ్చారు. ఇక ప్రశాంత్ కిషోర్ పార్టీకి 8.7 శాతం ఓట్లు వస్తున్నాయి. రెండు కూటమిల మధ్య తేడా జరిగితే ప్రశాంత్ కిషోర్‌నే కింగ్ మేకర్‌ అవుతారని సర్వే తేల్చి చెప్పింది. 13.70 శాతం మంది ప్రశాంత్ కిషోర్‌ను ముఖ్యమంత్రిగా కోరుకుంటుండగా.. నితీష్ కుమార్‌ను 24 శాతం మంది.. తేజస్వి యాదవ్‌ను మాత్రం 33.5 శాతం మంది కోరుకుంటున్నారు. అంటే తేజస్వి యాదవ్ క్రమక్రమంగా బలం పుంజుకుంటున్నారు.

అక్టోబర్-నవంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. త్వరలోనే ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి దీపావళి నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయొచ్చన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bihar elections
  • Bihar Elections 2025 survey
  • INDIA Bloc
  • Kingmaker
  • NDA

తాజావార్తలు

  • PCB Chairman vs IPL: ఇంత కుల్లుబోతోడివి ఏంది సామి నువ్వు.. ఐపీఎల్‌పై పీసీబీ ఛైర్మన్ ఏడుపు!

  • US-Iran War: తెరిచి ఉన్న “హార్ముజ్‌”ను యుద్ధం చేసి తెరిపిస్తున్న యూఎస్.. ఇదే విచిత్రం..

  • Bihar Madarsa: మదర్సా ముసుగులో నేర సామ్రాజ్యం? పోలీసుల సోదాల్లో విస్తుపోయే నిజాలు!

  • Andhra Pradesh: ఏపీ కొత్త మ్యాప్‌ నిజం కాదు.. APSDMA క్లారిటీ..

  • JD Chakravarthy:నేను కమల్ హాసన్ కాలి గోటికి కూడా సరిపోను..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions