Mohan Bhagwat: భారతదేశం ప్రపంచ సామరస్యానికి, సంక్షేమానికి దృఢంగా కట్టుబడి ఉన్న సమయంలో, ప్రస్తుతం ప్రపంచం భారతదేశ పవర్‌ని చూసిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న వ్యక్తి నుంచి మాత్రమే ‘‘ప్రేమ భాష’’ అర్థమవుతుందని ఆయన అన్నారు. పవర్ ఉంటేనే ప్రపంచం శాంతిని వింటుందని అన్నారు. జైపూర్‌లోని హర్మారాలోని రవినాథ్ ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో RSS చీఫ్ ప్రసంగింస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: PSLV-C61: ఇస్రో రాకెట్ వైఫల్యానికి కారణం ఇదేనా..?
పాకిస్తాన్‌పై ఇటీవల భారత్ నిర్వహించిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి మాట్లాడుతూ.. భారత్ ఎవరిని ద్వేషించదు, కానీ మీకు అధికారం ఉన్నప్పుడు మాత్రమే ప్రపంచ ప్రేమ, సంక్షేమం యొక్క భాషను వింటుంది అని అన్నారు. ఇది ప్రపంచ స్వభావమని, ఈ స్వభావాన్ని మార్చలేము, కాబట్టి ప్రపంచ సంక్షేమం కోసం, మనం శక్తివంతంగా ఉండాలి, ప్రపంచం మన బలాన్ని చూసింది అని అన్నారు.
“ప్రపంచ సంక్షేమమే మన మతం. ఇది ముఖ్యంగా హిందూ మతం యొక్క దృఢమైన విధి” అని భగవత్ అన్నారు. భారతదేశ పాత్ర అన్నయ్య పాత్ర అని, ప్రపంచంలో శాంతి, సామరస్యం కోసం పనిచేస్తుందని చెప్పారు. శ్రీలంక, నేపాల్, మాల్దీవులు సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నప్పుడు భారత్ సహాయం చేసిందని చెప్పారు.