UP: యూపీలో అఖిలేష్ యాదవ్ పోస్టర్లు కలకలం.. ప్యూచర్ పీఎం అంటూ ఫ్లెక్సీలు
- యూపీలో అఖిలేష్ యాదవ్ పోస్టర్లు కలకలం
- ప్యూచర్ పీఎం అంటూ ఫ్లెక్సీలు
- జూలై 1న బర్త్‌డే సందర్భంగా శ్రేణులు ఏర్పాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాబోయే దేశ ప్రధాని అంటూ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పోస్టర్లు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో వెలిశాయి. జూలై 1న అఖిలేష్ యాదవ్ పుట్టినరోజు.. దీన్ని పురస్కరించుకుని సమాజ్‌వాదీ పార్టీ శ్రేణులు, నేతలు పార్టీ కార్యాలయం దగ్గర పెద్ద పెద్ద హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు వేశారు. అన్ని పోస్టర్లలో ‘కాబోయే ప్రధాని’ అంటూ ముద్రించారు. ఇదిలా ఉంటే ఇలా పోస్టర్లు రావడం ఇదే తొలిసారి.. ఇలా ఆయా సందర్భాల్లో పలుమార్లు వేసి అభిమానులు అభిమానం చాటుకున్నారు.
ఇది కూడా చదవండి: Solar Car: భారత్ లో మొదటి సోలార్ కార్ ఇదే..ఫీచర్స్ అదుర్స్!
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
- CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
- Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
- CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రాష్ట్రంలో 80 పార్లమెంటరీ స్థానాలకు గాను 37 స్థానాల్లో ఎస్పీ విజయం సాధించింది. ఇక మిత్రపక్షం కాంగ్రెస్ ఆరు గెలుచుకోగా.. బీజేపీ 33 గెలుచుకుంది. మరో మూడు సీట్లు దాని భాగస్వాములకు రెండు RLDకి, ఒకటి అప్నా దళ్ ( S) దక్కాయి. కన్నౌజ్ నుంచి అఖిలేష్ యాదవ్ 1,70,922 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో పార్టీ సభ్యులు బర్త్‌డే సందర్భాన్ని పురస్కరించుకుని కాబోయే పీఎం అంటూ హోర్డింగ్‌ను ఏర్పాటు చేశారు. ఇక అయోధ్య జిల్లాలోని ఫైజాబాద్ లోక్‌సభ స్థానం నుంచి రెండుసార్లు బీజేపీ ఎంపీగా గెలిచిన లల్లూ సింగ్‌ను ఓడించి ఎస్పీ నేత అవధేష్ ప్రసాద్ రాజకీయంగా సంచలనం సృష్టించారు.
ఇది కూడా చదవండి: CRIME: ఆన్‌లైన్ గేమ్‌లకు వ్యసనంగా మారి..రూ.2వేల కోసం అమ్మమ్మను హత్య చేసిన మనవడు
అయితే పోస్టర్లు వేయడం ద్వారా ఎవరూ ప్రధాని కాలేరని.. లక్నోలో పెట్టిన ‘ఫ్యూచర్ పీఎం’ హోర్డింగ్‌లను అఖిలేష్ యాదవ్ తోసిపుచ్చారు .2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా రాష్ట్ర రాజధానిలో ఇలాంటి హోర్డింగ్ ఏర్పాటు చేశారు. “రాష్ట్రం, దేశానికి నాయకత్వం వహిస్తారని అఖిలేష్‌ను విశ్వసిస్తున్నామని.. దేశానికి కొత్త ప్రధాని కావాలి’’ అనే నినాదాలతో కూడిన పోస్టర్లు వివిధ ప్రదేశాలలో కనిపించాయి.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy : వైద్యం అందించడం ఒక సామాజిక బాధ్యత
అఖిలేష్ .. ప్రముఖ నేత ములాయం సింగ్ యాదవ్ కుమారుడు. అఖిలేష్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ నుంచి లోక్‌సభ ఎంపీగా పనిచేస్తున్నారు. గతంలో 38 సంవత్సరాల వయస్సులో యూపీకి 20వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పటి వరకు ఆ పదవిని నిర్వహించిన అతి పిన్న వయస్కుడిగా గుర్తింపుపొందారు. ఎంపీగా గెలవకముందు 18వ విధానసభలో కర్హల్ శాసనసభ సభ్యునిగా ఉన్నారు. మార్చి, 2022 నుంచి జూన్ 2024 వరకు ఉత్తర ప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నారు. ఎంపీగా గెలవడంతో ఎమ్మెల్యే పదవికి గుడ్‌బై చెప్పారు.
#WATCH | Uttar Pradesh: "Future Prime Minister Akhilesh Yadav" posters have been put up outside the Samajwadi Party (SP) office in Lucknow, ahead of SP chief Akhilesh Yadav's birthday on July 1. (28.06) pic.twitter.com/xN3O8Qzeai
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 29, 2024
తాజావార్తలు
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..