పహల్గామ్ ప్రాంతంలో సుమారు ఆరు వేలకు పైగా గుర్రాలు పర్యాటక సేవలకు రెడీగా ఉండగా, ప్రస్తుతం వాటిలో కేవలం 100 గుర్రాలకే పని లభిస్తుంది. దీని వల్ల రోజుకు సుమారు 2 కోట్ల రూపాయల మేర నష్టాన్ని మిగిలిస్తుంది. ఒక్కో గుర్రాన్ని సుమారు లక్ష రూపాయలకు కొనుగోలు చేసిన యజమానులు, వాటికి ఇప్పుడు పని లేకపోవడంతో పాటు రోజూ రూ.400 విలువైన ఆహారం గుర్రాలకు పెట్టాల్సింది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.