NTV Telugu Site icon

Prashant Kishor: ‘ద్రోహి’ అనడంలో తప్పేముంది? కునాల్ కమ్రాకు ప్రశాంత్ కిషోర్ మద్దతు

Prashantkishor

Prashantkishor

స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు రాజకీయ వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ మద్దతు తెలిపారు. కునాల్ కమ్రా తన స్నేహితుడని.. తనకు తెలిసినంతవరకు కునాల్ రాజకీయాలు చేయడన్నారు. అతనికి అలాంటి ఉద్దేశాలు లేవని చెప్పారు. బహుశా కునాల్ ‘ద్రోహి’ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు.

ఇది కూడా చదవండి: RR vs CSK: కాస్త లేట్ అయింది.. నా కెప్టెన్సీలో విజయం సాధించడం సంతోషం!

కునాల్ కమ్రా పుదుచ్చేరిలో నివాసం ఉంటున్నారని తెలిపారు. ఓ వైపు సేంద్రీయ వ్యవసాయం చేసుకుంటూనే.. ఇంకోవైపు స్టాండప్ కామెడీ చేస్తున్నారన్నారు. ఆయనకు రాజకీయంగా ఎలాంటి శత్రుత్వం లేదని చెప్పారు. దేశాన్ని ప్రేమించే వారిలో కునాల్ కమ్రా ఒకరు అని.. రాజ్యాంగం పట్ల గౌరవం ఉందని చెప్పుకొచ్చారు. కేవలం ఆయన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే ఇదంతా జరిగిందని చెప్పుకొచ్చారు. ఏదైనా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Visakhapatnam: రాంగ్ కాల్ ఛార్జ్ విలువ రూ . 4 కోట్లు..!

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేను ఉద్దేశించి ‘ద్రోహి’ అంటూ కునాల్ కమ్రా సంబోధించారు. ఈ వ్యాఖ్యలే తీవ్ర దుమారం రేపాయి. శివసేన కార్యకర్తలు.. కునాల్ కమ్రా ప్రోగ్రాం నిర్వహించిన క్లబ్‌పై దాడి చేసి ధ్వంసం చేశారు. అనంతరం ఆయనపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఇప్పటికే రెండు సార్లు ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. తమ ఎదుట హాజరు కావాలని కునాల్ కమ్రాకు తెలిపారు. కానీ ఆయన హాజరు కాలేదు. ఇంతలోనే మద్రాస్ హైకోర్టు‌లో ఊరట లభించింది. కునాల్ కమ్రాకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

ఇది కూడా చదవండి: RR vs CSK: మా ఓటమికి కారణం అదే: రుతురాజ్‌