NTV Telugu Site icon

POK: పీఓకే భారత్‌లో విలీనం అవుతుంది.. మాజీ ఆర్మీ చీఫ్ కామెంట్స్..

Pok

Pok

POK: గత కొంతకాలంగా పాకిస్తాన్ పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. ముఖ్యంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేర్పాటు ఉద్యమాలు నడుస్తున్నాయి. సింధ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్, గిల్గిల్ బాల్టిస్తాన్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఇదిలా ఉంటే పాక్ ఆక్రమిత్ కాశ్మీర్(పీఓకే), గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాల్లో ప్రజలు తాము భారత్ లో కలుస్తామని ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. గిల్గిల్ ప్రాంత ప్రజలు తమకు భారత్ కార్గిల్ ద్వారాలు తెరవాలంటూ ప్రాధేయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో మాజీ ఆర్మీ చీఫ్, ప్రస్తుత బీజేపీ నేత వీకే సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతకాలం తరువాత పీఓకే భారత్ ‌లో విలీనం అవుతుందని సోమవారం వ్యాఖ్యానించారు. భారత్ లో విలీనం చేయాలంటూ పీఓకే ప్రజలు డిమాండ్లపై ప్రశ్నించగా..పీఓకే భారత్‌లో కలుస్తుందని, కొంత సమయం వేచి ఉండండి అని అన్నారు. రాజస్థాన్ లోని దౌసాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Read Also: China: కనిపించకుండా పోయిన చైనా మంత్రి.. అసలేం జరుగుతుంది?

చైనా తన మ్యాపుల్లో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ ప్రాంతాలను కలుపుకోవడంపై వీకే సింగ్ స్పందించారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ మ్యాపులపై అభ్యంతరం వ్యక్తం చేశారని, ఇది చైనా ‘పాత అలవాటు’ అని అన్నారు. కేవలం భారత్ భూభాగాలను చేర్చినంత మాత్రాన ఏమీ జ రగని ఆయన అన్నారు. పీఓకే భారత్ లో అంతర్భాగమని, పాకిస్తాన్, చైనా కాశ్మీర్ గురించి ప్రస్తావించడాన్ని విమర్శించారు.

అంతకుముందు పీఓకే గురించి రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పాకిస్తాన్ ఎప్పుడూ లేనంతగా ఆర్థిక, రాజకీయ సమస్యల్లో ఉందని, పీఓకేని భారత్ హస్తగతం చేసుకోవడానికి ఇదే మంచి సమయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మేలో గోవాలో జరిగి ఎస్‌సీఓ మీటింగ్‌లో పీఓకేని ఎప్పుడు ఖాళీ చేస్తారు..? ఉగ్రవాదానికి పాక్ నిధులు సమకూర్చడంపై జైశంకర్ ప్రశ్నించారు. అప్పటి పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ సమక్షంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.