NTV Telugu Site icon

Global Expo 2025: ఢిల్లీలో ప్రారంభమైన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025

Pm Modi

Pm Modi

Global Expo 2025: దేశ రాజధాని ఢిల్లీలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన “భారత మండపం”, “యశోభూమి” కన్వెన్షన్ సెంటర్లలో “ఎక్స్‌పో” కొనసాగుతుంది. ఈ ఎక్స్‌పోలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పలు రవాణా రంగ సంస్థలు భాగం కానున్నాయి. నేటి నుంచి జనవరి 22వ తేదీ వరకు గ్లోబల్ ఎక్స్‌పో కార్యక్రమం కొనసాగనుంది. ఈ ఎక్స్‌పోలో పెవిలియన్ ఏర్పాటు చేసిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా‌స్ట్రక్చర్(MEIL)కు చెందిన “ఒలెక్ట్రా” సంస్థ. ఇక, మేఘా సంస్థ ఉత్పత్తి చేస్తున్న ఈ-బస్సులు, ఈ-ట్రక్కులతో ప్రదర్శన ఏర్పాటు చేసింది.

Read Also: Gold Rates Today : రోజుకో షాక్ ఇస్తున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎంత పెరిగిందంటే ?

ఇక, ఈ గ్లోబల్‌ ఎక్స్‌పోను ఇండియన్‌ స్టీల్‌ అసోసియేషన్, ఏటీఎంఏ, ఐసీఈఎంఏ, సియామ్, ఏసీఎంఏ, ఐఈఎస్‌ఏ, నాస్కామ్, సీఐఐ, మెటీరియల్‌ రీసైక్లింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. దీనికి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తోడ్పాటును అందిస్తుంది. అలాగే, ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా సందర్శకులు ఈ ఎక్స్‌పోలో పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇందులో 5,100 మంది అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు భాగస్వాములుగా కొనసాగుతున్నారు.