Gold Rates Today : బంగారం అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే ముఖ్యంగా మహిళలకు. బంగారాన్ని ఆపదలో ఆదుకునే ఆపద్బాందవుడిలా చూస్తారు చాలా మంది. అందుకే బంగారం పై పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడుతుంటారు. ఎంత ఎక్కువ బంగారం ఉంటే అంత ప్రస్టేజీగా ఫీల్ అయ్యే వాళ్లూ లేకపోలేదు. కానీ కొంత కాలంగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బంగారం ధరలు రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి. నూతన సంవత్సరం మొదటి నుంచి కూడా బంగారం ధర రికార్డు స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు గానూ రూ. 81,000 దాటేసింది.
Read Also:HHVM : హరి హర వీరమల్లు ఫస్ట్ సింగిల్ ‘మాట వినాలి’ రిలీజ్
బంగారం ధరలు భారీగా పెరగడానికి దేశీయంగా డిమాండ్ పెరగడం కూడా ఒక కారణం. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 600 పెరగడంతో తులం ఇప్పుడు రూ. 74,500కు చేరింది. దీనికి ముందు రోజు రూ. 500పెరిగింది. మరోవైపు 24 క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన పసిడి ధర రూ. 650 పెరగడంతో 10 గ్రాములకు రూ. 81,270వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు పెరిగింది. వెండి ధరల విషయానికి వస్తే కిందటి రోజు రూ. 1000 పెరిగి కేజీ సిల్వర్ రేటు ప్రస్తుతం రూ. 1.04 లక్షలకు చేరుకుంది.
Read Also:IMLT20: గుడ్ న్యూస్.. మరోమారు టీమిండియా కెప్టెన్‌గా సచిన్