PM Modi Russia visit: భారత ప్రధాన మంత్రి నరేంద్ర నేడు (సోమవారం) 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యా వెళ్లనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు బ్రిక్స్ సదస్సుకు మోడీ హజరు కానున్నారు. అక్టోబర్ 22-23 తేదీల్లో కజాన్‌లో జరిగే బ్రిక్స్ సదస్సు రష్యా అధ్యక్షతన జరుగుతోంది. తన పర్యటన సందర్భంగా.. ప్రధాని మోడీ బ్రిక్స్ సభ్యదేశాల అధినేతలతో సమావేశం కానున్నారు. కేవలం గ్లోబల్ డెవలప్మెంట్ మాత్రమే కాకుండా భద్రత, బహూపాక్షికత బలోపేతం చేయడం’’ అనే థీమ్‌తో ఈ సదస్సు జరగబోతుంది. ఈ సమ్మిట్ కీలకమైన ప్రపంచ సమస్యలను చర్చించడానికి వేదికగా మారుతుందని భావిస్తున్నారు.
Read Also: KTR : కార్యకర్తలను వేధిస్తే ఊరుకునేది లేదు.
కాగా, BRIC (బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా) దేశాల నాయకులు 2006లో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో తొలి సారి సమావేశమయ్యారు. ఆ తర్వాత 2010లో సౌత్ ఆఫ్రికా ఈ గ్రూపులో చేరడంతో BRICS (బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా) గా పేరు మార్చబడింది. అయితే, ఈ సంవత్సరం ఈ సంస్థలో ఈజిప్ట్, ఇరాన్, ఇథియోపియా, యూఏఈ చేరాయి. ఈ కూటమి ప్రపంచ జనాభాలో 41 శాతం, జీడీపీలో 24 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 16 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది. ప్రపంచంలో ప్రధాన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్ని ఒక చోట చేర్చే ముఖ్యమైన సమూహంగా చెప్పొచ్చు. కాగా, కజాన్‌లో జరిగే బ్రిక్స్ సదస్సుకు 24 దేశాల నాయకులతో పాటు మొత్తం 32 దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. రష్యాలో ఇదే అతి పెద్ద విదేశాంగ విధాన సమ్మిట్ గా పేర్కొన్నాలి.