NTV Telugu Site icon

Sanjay Raut: ప్రధాని మోడీపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..

Sanjay

Sanjay

Sanjay Raut: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల నాగ్‌పూర్‌లోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యాలయాన్ని సందర్శించడంపై శివసేన యూబీటీ నాయకుడు సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన పదవీ విరమణ ప్రణాళికలను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు మోడీ తెలియజేశారని పేర్కొన్నారు. ఇక, ప్రధాని మోడీ వారసుడిని ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తుందని ఆయన ఆరోపించారు. నాకు తెలిసినంత వరకు గత 10-11 సంవత్సరాలలో మోడీ జీ ఎప్పుడూ కూడా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించలేదు అని ఎద్దేవా చేశారు. జాతీయ స్థాయిలో నాయకత్వ మార్పు కోసం ఆర్ఎస్ఎస్ ఒత్తిడి తెస్తోందని సంజయ్ రౌత్ చెప్పుకొచ్చారు.

Read Also: HCU: 1973 లో 2300 ఎకరాల్లో హెచ్‌సీయూ ఏర్పాటు.. ఆ 400 ఎకరాలు ఎవరిది?

ఇక, భవిష్యత్ నాయకుడిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్ణయిస్తుంది అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ గురించి నేను అర్థం చేసుకున్న రెండు విషయాలు మీకు తెలియజేస్తున్నాను.. మొదటిది, ఆ సంస్థ దేశ నాయకత్వంలో మార్పును కోరుకుంటుంది.. రెండోది, మోడీ జీ కాలం ముగిసింది.. ఆయనను కూడా మార్పును కోరుకుంటున్నారని అతడు నొక్కి చెప్పారు. అయితే, ఆర్‌ఎస్‌ఎస్ ఇప్పుడు తదుపరి బీజేపీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవడంలో బీజీగా ఉంది.. ప్రధాని మోడీ పర్యటన సంఘ్ పరివార్‌లోని విస్తృత రాజకీయ ఎత్తుగడలో భాగమని సంజయ్ రౌత్ ఆరోపించారు.