PM Modi Appeal: ప్రధాని మోడీ ప్రత్యేక విజ్ఞప్తి.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi Appeal: దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఎండల తీవ్రత కారణంగా సాధారణ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నిరంతరం పెరుగుతున్నాయని ప్రధాని తెలిపారు. దీంతో రోజువారీ జీవితంపై తీవ్ర ప్రభావం పడుతోందని, ముఖ్యంగా ఎండ వేడి కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ప్రజలు శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలని సూచించారు ప్రధాని మోడీ… బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా తాగునీరు వెంట తీసుకెళ్లాలని, వీలైనంత వరకు ఎండలో ఎక్కువసేపు తిరగకుండా జాగ్రత్త పడాలని కోరారు. అలాగే సమాజంలో పరస్పర సహకారం ఎంతో అవసరమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. దాహంతో ఉన్న వారికి ఒక గ్లాస్ నీరు అందించడం కూడా గొప్ప సేవేనని చెప్పారు. ఇళ్ల ముందు, దుకాణాల బయట మట్టికుండల్లో తాగునీరు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టి, ఎవరైనా వచ్చి నీళ్లు తాగేందుకు అవకాశం కల్పిస్తున్న వారిని ప్రధాని అభినందించారు. తీవ్రమైన ఎండల సమయంలో మానవత్వంతో ముందుకు వచ్చి ఇతరులకు సాయం చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు పెట్టారు ప్రధాని మోడీ..
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
Different parts of India are witnessing soaring temperatures and the challenges that come with it. This heat is harsh on all of us and I urge you all to take as many precautions as possible. Please stay hydrated, keep water with you when stepping out. Offer a glass of water to…
— Narendra Modi (@narendramodi) May 27, 2026
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!