Site icon NTV Telugu

PM Modi: మరో విదేశీ టూర్‌కు మోడీ.. నెక్ట్స్ వీక్ సౌదీ అరేబియాలో పర్యటన

Pmmodi

Pmmodi

ప్రధాని మోడీ మరో విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఏప్రిల్ 22, 23 తేదీల్లో మోడీ సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ శనివారం వెల్లడించింది. సౌదీ అరేబియా ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు మోడీ ఆ దేశంలో పర్యటిస్తున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ 21 నుంచి భారత్‌లో పర్యటించనున్నారు. సోమవారం జేడీ వాన్స్-మోడీ భేటీ జరగనుంది. అనంతరం మోడీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: BJP MP: ‘‘సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే పార్లమెంట్ మూసేయాలి’’.. వక్ఫ్ చట్టంపై బీజేపీ ఎంపీ..

మోడీ సౌదీ అరేబియా పర్యటన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేస్తుందని విదేశాంగ తెలిపింది. ఇరు దేశాల మధ్య వివిధ అంశాలపై చర్చ జరగనున్నట్లు పేర్కొంది. అమెరికా-ఇరాన్ మధ్య అణు ఒప్పందంపై తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మరోవైపు హమాస్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో మోడీ పశ్చిమాసియాలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా వచ్చే నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా సౌదీలో పర్యటించనున్నారు.

ఇది కూడా చదవండి: Ashwin- Dhoni: అశ్విన్.. ధోనీ గురించి మాట్లాడేందుకు ఇష్టపడలేదు.. ఎందుకిలా చేశాడబ్బా?

ఇక మోడీ మూడోసారి అధికారం చేపట్టాక సౌదీ అరేబియాలో పర్యటించడం ఇదే తొలిసారి. 2016, 2019లో రెండు సార్లు సౌదీ అరేబియాలో పర్యటించారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక మాత్రం ఇదే మొదటి పర్యటన.

 

Exit mobile version