NTV Telugu Site icon

PM Modi: వచ్చే వారం రష్యా, ఆస్ట్రియా దేశాల్లో పర్యటించనున్న ప్రధాని మోడీ

Pm Modi

Pm Modi

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ జులై 8 నుంచి 10 వరకు రష్యా, ఆస్ట్రియాల్లో అధికారిక పర్యటనకు వెళ్లనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం వెల్లడించింది. 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడానికి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోడీ జులై 8 , జులై 9 తేదీల్లో మాస్కోలో పర్యటించనున్నారు. ఇరు దేశాల నాయకులు దేశాల మధ్య ఉన్న బహుముఖ సంబంధాలను సమీక్షించుకోనున్నారు. పరస్పర ఆసక్తి ఉన్న సమకాలీన ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను మార్పిడి చేసుకుంటారని అని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Read Also: Moscow: మాస్కోను ఠారెత్తిస్తున్న ఎండలు.. వందేళ్ల రికార్డ్ బద్దలు

ఫిబ్రవరి 2022లో తన సైనిక దాడిని ప్రారంభించి పొరుగుదేశమైన ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి ప్రధాని మోడీ రష్యాకు పర్యటన కోసం వెళ్లడం ఇదే మొదటి సారి. 2019లో ఫార్ ఈస్ట్ సిటీ వ్లాడివోస్టాక్‌లో జరిగిన ఆర్థిక సదస్సుకు చివరిసారికి రష్యాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు.అప్పటి నుంచి ఇప్పటివరకు రష్యాలో పర్యటించకపోవడం గమనార్హం. రష్యాలో తన శిఖరాగ్ర సమావేశం అనంతరం ప్రధాని మోడీ జులై 9, జులై 10 తేదీలలో ఆస్ట్రియాలో పర్యటించనున్నారు. 41 ఏళ్లలో యూరోపియన్ దేశంలో భారత ప్రధాని చేసే మొదటి పర్యటన ఇది. వియన్నాలో ప్రధాని మోడీ ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెల్లెతో సమావేశమై, ఆ దేశ ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్‌తో చర్చలు జరుపుతారు. ఆ తర్వాత ప్రధాని మోదీ, నెహమ్మర్ ఇరు దేశాలకు చెందిన వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.