NTV Telugu Site icon

PM Modi: ఈ విషయంలో అన్నా హజారే కూడా సంతోషిస్తారు

Delhipmmodi

Delhipmmodi

అవినీతి పార్టీ ఓటమితో అన్నా హజారే కూడా ఎంతో సంతోషిస్తారని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తర్వాత.. పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోడీ మాట్లాడారు. అనినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే ఎంతో పోరాడారని.. ఇప్పుడు ఢిల్లీలో అవినీతి పార్టీ ఓటమితో హజారే కూడా ఎంతో సంతోషిస్తారని చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా పార్టీ పెట్టినవారు అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. ఢిల్లీ తొలి అసెంబ్లీ సమావేశంలోనే కాగ్‌ రిపోర్ట్‌ పెడతామని మోడీ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Gang Rape: హైదర్షాకోట్ గ్యాంగ్ రేప్లో సంచలన విషయాలు..

‘‘ఢిల్లీని వాయుకాలుష్యం, పారిశుద్ధ్య సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ఆప్‌ ప్రభుత్వంలో యమునా కాలుష్యకాసారంగా మారిపోయింది.యమునాలో విషం కలిపారంటూ హర్యానా ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేశారు. యమునాను ఆప్‌ ప్రభుత్వం అపవిత్రం చేసింది.. కాలుష్య కోరల నుంచి యమునా నదిని రక్షిస్తాం.. ఎంత కష్టమైనా యమునాను ప్రక్షాళన చేసి తీరుతాం.’’ అని మోడీ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Vandhe Bharat : వందే భారత్‌లో ప్రయాణించే వారికి గుడ్ న్యూస్.. ఇప్పుడు ఖాళీ కడుపుతో ఉండాల్సిన అవసరం లేదు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 48 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత హస్తినలో కమలం పార్టీ సర్కార్‌ను ఏర్పాటు చేయనుంది. ఇక ఆప్ 22 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక ఓటమిని కేజ్రీవాల్ స్వాగతించారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇక ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఘోర పరాజయం పాలయ్యారు.